ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గిపోయిన ఆదాయాన్ని పన్నులు పెంచి ప్రజల నుంచి పిండుకోవాలనే ఆలోచన చేస్తోంది. నిన్న ఆర్టీసీ చార్జీలు పెంచారు. రేపు కరెంట్ చార్జీల పెంచబోతున్నారు. చివరికి రైతులపై భూమిశిస్తు కూడా వేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఎన్ని రకాల మార్గాలుంటే.. అన్ని రకాల మార్గాల ద్వారా… ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్ం.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇలా పన్నులు పెంచి ప్రజలపై భారం వేయడం కరెక్ట్ కాదని… ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము వస్తే.. ప్రజలపై ఎలాంటి భారం వేయబోమని.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పారని… ఇప్పుడు దాన్ని రివర్స్‌లో అమలు చేస్తూ.. మోసం చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు… ఘాటుగానే రియాక్టయ్యారు.
చార్జీల పెంపుపై… అసెంబ్లీలో లాబీల్లో మంత్రులు విభిన్నంగా స్పందిస్తున్నారు. అసెంబ్లీలో లోపల బస్ చార్జీల పెంపుపై చర్చ పెట్టని ప్రభుత్వం లాబీల్లో మీడియా ముందు మాత్రం.. తన విధానాన్ని చెబుతోంది. ఆర్టీసీ బస్ చార్జీలను పెంచొద్దని పాదయాత్రలో జగన్‌ను ఎవరూ అడగలేదని… మంత్రి పేర్ని నాని చిత్రమైన లాజిక్ వినిపించారు. అలాగే.. ఆర్టీసీ చార్జీలు పెంచబోమని కూడా.. తాము ఎవరికీ హామీ ఇవ్వలేదని.. చెప్పుకొచ్చారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ అయితే.. మరో లాజిక్ పట్టుకొచ్చారు. అదేంటంటే.. ఆర్టీసీ చార్జీలు పెంచేదిలేదని జగన్ ఎక్కడా చెప్పలేదని, తమ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం లేదన్నారు. ఎక్కడైనా ఉంటే చూపించాలంటూ.. మేనిఫెస్టోను కూడా బయటకు తీశారు.
ప్రతీదానికి జగన్, మంత్రులు మేనిఫెస్టోను చూపిస్తున్నారు. మేనిఫెస్టో అంటే.. హామీల పత్రమే. ఐదేళ్ల కాలంలో తాము ఏం చేస్తామో.. అందులో చెబుతారు. కానీ అవి మాత్రమే చేస్తాం.. అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. చార్జీలు పెంచబోమని… పెంచుతామని.. ఎవరూ మేనిఫెస్టోల్లో పెట్టరు. అలా పెట్టకపోవడాన్ని కూడా.. అడ్వాంటేజ్ గా తీసుకుని మంత్రులు.. వాదనలు వినిపిస్తున్నారు. మేనిఫెస్టోకే కొత్త అర్థం తీసుకొస్తున్నారు.