లక్షన్నర పర్మినెంట్ ఉద్యోగాలిచ్చాం. ఆరు నెలల్లో సాధించిన గొప్ప విజయం అంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ.. ఆ లక్షన్నర పర్మినెంట్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి రెండు నెలలు దాటిపోయింది. కానీ ఇంత వరకూ… ఒక్కరంటే.. ఒక్కరికీ కూడా.. జీతాలు చెల్లించలేదు. అక్టోబర్ ప్రారంభంలో… అందరికీ నియామక పత్రాలు అందించారు. నవంబర్ ఒకటో తేదీన జీతం వస్తుందని.. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ.. అలాంటి ఆలోచనే సర్కార్ చేయలేదు. అప్పటికి ఎలాంటి వ్యవస్థ.. గ్రామ సచివాలయాలు లేకపోవడంతో… సరే.. వచ్చే నెల నుంచి ఇస్తారని ఎదురు చూశారు.
నవంబర్లో గ్రామ సచివాలయ ఉద్యోగులుకు కొన్ని పనులు అప్పగించారు. వారు కూడా విధులకు వెళ్లారు. డిసెంబర్ మొదట్లో… అందరితో పాటు తమకూ జీతాలొస్తాయని ఎదురు చూశారు. కానీ.. రాలేదు. కనీసం.. తమ బ్యాంక్ అకౌంట్లు.. ఇతర వివరాలు అయినా తీసుకుంటారేమోనని ఎదురు చూశారు. అవి కూడా తీసుకోలేదు. చివరికి..అధికారులు రొక్కం చేతికిస్తారేమోనని ఎదురు చూశారు. కానీ.. పదో తారీఖు దాటినా.. అలాంటి సూచనలు కనిపించడం లేదు. పైగా.. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయని.. ముఖ్యమంత్రి చెబుతున్నారు.
దాని అర్థం.. జనవరి నుంచి పని చేస్తే.. ఫిబ్రవరి నుంచి జీతాలు వస్తాయని.. అధికారులు.. ఇప్పుడిప్పుడే.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో.. అప్పటి వరకూ తాము జీతం లేకుండా పని చేయాలా.. అని.. వారు అసంతృప్తికి గురవుతున్నారు. వీరితో పనులు చేయించుకుంటున్న కలెక్టర్లు… తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వారికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంత మంది … ఏదో ఓ ఖాతాలో చూపి.. వారికి ఎంతో కొంత సాయం చేస్తున్నా… అది జీతం కాదు.. అప్పు ఖాతానే. అందుకే.. ఉద్యోగాలిచ్చి.. జీతాలివ్వడం లేదని.. సచివాలయ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.