చంద్రబాబు… చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నారంటూ.. అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చించారు. అసలు చంద్రబాబు ఆ మాట అనలేదని టీడీపీ వాదించింది. అసెంబ్లీలో ప్రదర్శించిన వీడియోల్లో బాస్టర్డ్ అన్న పదం కూడా వినిపించలేదు. నో క్వశ్చన్ అనే పదం దగ్గర… వీడియోను అటూ ఇటూ కదపడంతో.. అలా వినిపించింది. దీని వెనుక కుట్ర ఉందనుకున్న.. టీడీపీ వెంటనే.. అప్రమత్తం అయింది. పూర్తి వీడియోను విడుదల చేసింది. స్పీకర్ వద్దకు వెళ్లి… బాస్టర్డ్ అనే పదం పుట్టించారంటూ… జగన్ పై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది. నోటీసుతో పాటు వీడియో కూడా చూపించారు.
ఎన్నిసార్లు వీడియో ప్రదర్శించినా ఆ వీడియో క్లిప్పింగ్ లో చంద్రబాబు నోటి నుంచి ” తలుపు తీయ్యి.. నో క్వశ్చన్.. అసెంబ్లీకి పోకూడదా.. మర్యాదగా చెప్తున్నా..” అన్న మాటలే ఉన్నాయి. టీడీపీ సభ్యులు శాసనసభలో ప్రదర్శించిన వీడియో టేపులను మళ్లీ ఐ ఫోన్లలో స్పీకర్ కు నాలుగైదుసార్లు ప్రదర్శించి చూపారు. చంద్రబాబు అప్రజాస్వామిక భాషను వాడలేదని స్పీకర్ కు వివరించారు. చంద్రబాబును సస్పెండ్ చేద్దామనుకున్న అధికారపక్షం.. ఒక్క సారిగా.. చంద్రబాబు ఆ మాటలు అనలేదని తేలడంతో.. బ్యాక్ ఫుట్ వేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే.. ఈ విషయాన్ని టీడీపీ ఇంతటితో వదిలే అవకాశం కనిపించడం లేదు. తమకు తెలిసిన మార్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక … అబద్దాలు చెప్పి… అధికారాన్ని చూపి.. దారుణాలకు పాల్పడుతోందన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు అనని అన్ పార్లమెంటరీ పదాన్ని అసెంబ్లీలో పదే పదే చెప్పారు. ఇది కూడా.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపింది.