ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న విన్యాసాలు సామాన్య ప్రజలను విస్మయానికి.. అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను.. ఫైనాన్షియల్ ప్లాన్‌ను.. పక్కన పడేసి.. అదే అమరావతిని ఎలా… తీర్చిద్దాల్లో కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. మొన్నటికి మొన్న..జీఎన్‌రావు అనే మాజీ అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసిన ఏపీ సర్కార్.. ఆ కమిటీని బూచిగా చూపిస్తూ… వస్తోంది. ఆ కమిటీ ఎక్కడ రాజధాని అంటే.. అక్కడే రాజధాని అంటూ బొత్స సత్యనారాయణ.. అడిగిన వారికీ.. అడగని వారికి కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మరో కమిటీ అమరావతి మీద.. అధ్యయనానికి రంగంలోకి దిగింది. “రూర్కీ ఐఐటీ” నుంచి ఈ నిపుణుల కమిటీ వస్తోందట..!
అమరావతి పరిశీలనకు వస్తున్న “రూర్కీ ఐఐటీ” కమిటీ ఏం చేస్తుందంటే.. అమరావతి నిర్మాణాలను ఎంత వరకు కుదించవచ్చు అనేది పరిశీలన చేస్తుందట. ఇప్పటి వరకు అమరావతిలో చేపట్టిన పనులను పరిశీలించి ఎంత వరకు పురోగతి ఉందో, ఏ మేరకు కుదించవచ్చో, ప్లాన్‌లో ఏ మేరకు మార్పులు చేయవచ్చో ఈ నిపుణులు తేల్చుతారట. సుమారు నెల, నెలన్నర రోజుల్లో దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. సాధారణం ప్రభుత్వం వేటిని నిలిపివేయాలనుకుంది.. వేటిని కట్టాలనుకుంటోందో..ముందే వారికి చెబుతారు కాబట్టి.. ఆ ప్రకారమే నివేదిక వస్తోంది.
అమరావతి విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న వైఖరి సాధారణ ప్రజలనే కాదు… నిపుణులనూ విస్మయానికి గురి చేస్తోంది. కమిటీల మీద కమిటీలు.. అదే పనిగా.. అమరావతిపై వ్యతిరేకప్రచారం చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. రాజధానిని మార్చుకునే వెసులుబాటు ఉంటే మార్చుకోవచ్చు కానీ.. ఇలా సొంత రాష్ట్ర రాజధానిని ఎప్పటికప్పుడు డిగ్రేడ్ చేస్తూ.. అధికారిక నిర్ణయాలు తీసుకోవడం.. పొరుగు రాష్ట్రాల వారిని సైతం నివ్వెర పరుస్తోంది.