పౌరసత్వం చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొద్ది మంది అత్యుత్సాహంతో ఇవి హిందూ- ముస్లిం గొడవలుగా మారేలా… కనిపిస్తున్నాయన్న ఆందోళన దేశ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. పౌరసత్వ సవరణ బిల్లుతో …తమకు ఇబ్బందులు వస్తాయని ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యలను కేంద్రం పట్టించుకుని ఏదో ఓ పరిష్కారం చూపిస్తుంది.కానీ ఈ మధ్యలో.. ముస్లింలను రెచ్చగొట్టేందుకు హిందువుల పేరుతో కొంత మంది నిప్పు రాజేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో నిరసనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఢిల్లీలో ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో నిన్న విధ్వంసం జరగడంతో అర్ధరాత్రి పోలీసులు జామియా వర్శిటీ హాస్టళ్లలోకి చొరబడ్డారు. విద్యార్థులపై దాడి చేశారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా.. బాత్రూమ్ల్లోకి దూరి మరి కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉర్దూ యూనివర్శిటీల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అల్లర్ల విషయంలో జామియా యూనివర్శిటీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్దాఖలు చేశారు. కొంత మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థులకు అండగా ఉంటామన్న జామియా వీసీ నజ్మా అక్తర్ ప్రకటించారు. ఢిల్లీ మైనార్టీ కమిషన్ ఆదేశాలతో జామియా విద్యార్థుల విడుదలను పోలీసులు విడుదల చేశారు. అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అయితే… ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలే.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమని విపక్షాలు మండి పడుతున్నాయి.
చట్టమైనా రద్దు కావాలి లేదా ప్రభుత్వమైనా దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ, ముస్లిం గొడవ కాదు..రాజ్యాంగ సంక్షోభమని అంటున్నాయి. దేశంలోని పరిస్థితులు సివిల్ వార్ జరుగుతున్నట్లుగా ఉన్నాయని మండిపడుతున్నారు. అంతకంతకూ విస్తరిస్తున్న గొడవలతో దేశం మొత్తం .. పౌరసత్వ బిల్లు హాట్ టాపిక్ గా మారుతోంది.