సరిలేరు నీకెవ్వరు నుంచి ఇప్పటి వరకూ రెండు పాటలొచ్చాయి. వాటి రిజల్ట్ సో..సోగానే ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో పాట వచ్చింది. హీజ్ సో క్యూట్.. హీజ్ సో హ్యాండ్సామ్… అంటూ సాగే ఈ గీతం – పాటకు తగ్గట్టే క్యూట్ అండ్ స్వీట్‌గా సాగింది. ఈ పాటలో రష్మికదే హవా. సాధారణంగా హీరోయిల్ని హీరోలు టీజ్ చేస్తూ పాట పాడతారు. అయితే ఇక్కడ కాస్త రివర్స్. హీరోని టీజ్ చేస్తూ హీరోయిన్ పాడే పాట.
అబ్బబ్బబ్బబ్బ… అబ్బాయొంత ముద్దొస్తున్నాడే.. ఆకాశం అంతేతంట ఎంత ఎంత ఎత్తుగున్నాడే.. – అంటూ సాగే ఈ గీతంలో రష్మిక తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. రాజు సుందరం వేయించిన స్మూత్ స్టెప్పులతో ఈ పాట మరింత అందంగా తెరకెక్కింది. రష్మిక కాస్ట్యూమ్స్ కొన్ని చోట్ల ట్రెండీగా, ఇంకొన్ని చోట్ల.. ట్రెడీషన్లా కనిపించాయి. లొకేషన్లు కూడా చాలా కూల్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన పాటల్లో, టీజర్లలో రష్మిక అస్సలు కనిపించలేదని ఆమె ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. ఆ లోటు ఈ పాట తీర్చేసింది. దేవి ట్యూను కాచీగానే అనిపించింది. విడుదలైన రెండు పాటలూ బాగా ట్రోలింగ్కి గురయ్యాయి. ఈ పాట అంత ఛాన్స్ ఇవ్వకపోవొచ్చు.