సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందునా బోయపాటి శ్రీనులాంటి వాళ్లైతే సెంటిమెంట్లతోనే బతుకుతుంటారు. ప్రతీ సినిమాకీ ముందు తాను కనిపించి `యాక్షన్` చెప్పడం బోయపాటి స్టైల్. అదో సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు ఓ కథానాయిక కూడా ఆ సెంటిమెంట్‌లో చేరింది. తనే… కేథరిన్.
బోయపాటి సినిమా ‘సరైనోడు’లో కథానాయికగా నటించింది కేథరిన్. ఆ సినిమా హిట్టయ్యింది. దాంతో… తన తదుపరి సినిమా ‘జయ జానకీ నాయిక’లో ఓ పాటకు తీసుకొచ్చి చిందులు వేయించాడు. ఇప్పుడు మరోసారి కేథరిన్‌ని ఎంచుకున్నాడట బోయపాటి.
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఇద్దరు కథానాయికలుంటారు. ఓ నాయిక కోసం సోనాక్షి సిన్హా నుంచి నయనతార వరకూ అందరి పేర్లూ పరిశీలిస్తున్నారు. కానీ ఎవ్వరూ అందుబాటులో లేకుండా పోయారు. రెండో నాయిక స్థానం మాత్రం కేథరిన్‌తో లాక్ చేసేశారని తెలుస్తోంది. బోయపాటి తన సెంటిమెంట్ ప్రకారమే… కేథరిన్‌ని ఛాన్సిచ్చాడని తెలుస్తోంది. కేథరిన్ ప్రస్తుతం ఎలాగూ ఖాళీగానే ఉంది. అందుకే.. తాను కూడా ఓకే చెప్పేసింది. మొత్తానికి బోయపాటి మరోసారి తన సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నాడు. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో..?