సొంత దేశంపై కుట్ర పన్నారని నిర్ధారిస్తూ.. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు.. మరణశిక్ష విధించింది పెషావర్ హైకోర్టు. 2007లో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఎమర్జెన్సీ విధించినట్లుగా.. కోర్టు నిర్ధారించింది. దీన్ని దేశద్రోహంగా భావిస్తూ మరణశిక్ష విధించింది. సైనికాధికారిగా ఉన్న ముషారఫ్…దేశాన్ని తన పాలనలో సుదీర్ఘ కాలం ఉంచుకున్నారు. 2001 నుండి 2008 వరకూ పాకిస్థాన్‌ను పరిపాలించారు. మొదట సైనిక పాలకుడిగా ఉన్నా.. తర్వాత పార్టీ పెట్టారు. ఓ సారి గెలిచినా.. మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. దేశం విడిచి వెళ్లిపోయారు. దేశద్రోహానికి పాల్పడ్డారని.. 2013లో ముషారఫ్‌పై కేసు నమోదయింది.
అప్పటి నుండి విచారణ జరుగుతోంది. 2008లో ఒక సారి దేశం నుంచి వెళ్లిపోయిన ముషారఫ్.. 2013లో పాకిస్థాన్ వెళ్లారు. ఆ తర్వాత కూడా ఆయనపై.. ఆనేక కేసులు నమోదవడం… దేశద్రోహం కేసులో శిక్ష పడుతుందన్న క్లారిటీ రావడంతో.. మళ్లీ ఆయన పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం 2016లో పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయారు. తర్వాత కోర్టు ముందు హాజరు కాలేదు. దాంతో ఆయనను పరారీలో ఉన్నట్లుగా పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో తలదాచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
దుబాయ్‌లో ఆశ్రయం పొందినందున.. ముషారఫ్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని.. భావిస్తున్నారు. అయితే.. ఆయన పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ముషారఫ్ పార్టీ పోటీ చేయలేకపోయింది. ముషారఫ్ పాకిస్తాన్ సైనిక చీఫ్‌గా ఉన్న సమయంలో.. ఇండియాపై దురాక్రమణ జరిగింది. కార్గిల్ యుద్ధం.. ముషారఫ్ వల్లే వచ్చింది.