అభివృద్ధిని వికేంద్రీకరించాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల ఆలోచన ఆచరణ సాధ్యమేనా… అన్న విషయం పక్కన పెడితే.. అసలు.. ఈ ఆలోచన వెనుక వ్యూహం ఏమిటన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కొట్టారని.. ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. అమరావతిని.. కేవలం చట్టసభలకు పరిమితం చేయడం ద్వారా.. ఇతర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ తాము అనుసరించిన వ్యూహానికి బలమైన ప్రాతిపదిక లభిస్తుందని జగన్ అంచనా వేసుకున్నట్లుగా చెబుతున్నారు. అమరావతి అంటే ఒక వర్గానిదేనన్న ప్రచారాన్ని ఇప్పటి వరకూ మంత్రులు చేశారు. ఒక వర్గం కోసమే అభివృద్ధి చేయబోమంటూ.. చెబుతూ వచ్చారు.
దాంతో ఇతర ప్రాంతాలకూ .. పరిపాలనా, న్యాయ విభాగాలను తరలించడం వల్ల.. ఆయా ప్రాంతాలనూ అభివృద్ధి చేసినట్లవుతుందని చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టు కోసం.. చాలా కాలంగా.. అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వారి డిమాండ్ ను పరిష్కరిస్తూ… రాజధాని ఏర్పాటు చేసినట్లు ఉంటుందని… అలాగే.. ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడం ద్వారా.. అక్కడ కూడా రాజకీయ మైలేజీ వస్తుందని జగన్ ఆశించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. రాజకీయ వ్యూహం కూడా.. జగన్ అమలు చేశారని అనుకోవచ్చు. ఇప్పుడు విపక్ష పార్టీలు కానీ.. సొంత పార్టీల నేతలు కానీ.. ఈ నిర్ణయంపై నోరెత్తే అవకాశం లేదు.
ఏవరైనా వ్యతిరేకిస్తే.. ఆ ప్రాంతానికి వారు వ్యతిరేకమనే వాదనను తెరపైకి తెస్తారు. ఇప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి.. విపక్ష పార్టీల నేతలకు ఏర్పడినట్లయిందంటున్నారు. శానస, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు.. ఒకదానితో ఒకటి సంబంధం ఉండి ఉంటాయి. మూడు మూడు ప్రాంతాల్లో ఉంటే.. పాలన అంత గందరగోళంగా మారిపోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల మధ్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు… అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ జగన్ పరిశీలించారా లేక.. తన ఆలోచనల మేరకే రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రజలు మాత్రం.. ఆరేళ్ల తర్వాత కూడా రాజధాని లేకుండా రోడ్డున పడినట్లయింది.