ఏపీలో అధికారులు.. క్రైస్తవ సమాజాన్ని ఉద్దరించేందుకే తాము పాలకులం అయ్యామన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాను క్రైస్తవుడ్ని అయినందునే.. కలెక్టర్‌ను అయ్యానని.. తాను కలెక్టర్ అయినందుకే.. ఆరు వేల మంది క్రైస్తవ బిడ్డలకు..ఏడు నెలల్లో ఉద్యోగాలిచ్చానని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు.. వైరల్ అవుతోంది. కొద్ది రోజుల కిందట.. విజయ్ కుమార్ అనే మున్సిపల్ శాఖ కమిషనర్ కూడా.. దేవునిబిడ్డ జగన్… దేవుని బిడ్డలకు మంచి చేయడానికి వచ్చాడని.. ఘనంగా ప్రకటించి.. మరి పోస్టు పొందారు. ఇప్పుడు శామ్యూల్ ఆనంద్ కూడా అదే పనిలో ఉన్నారు.
ఏపీలో ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. మత మార్పిళ్లు ఓ ఉద్యమంలా జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మాత మార్పిళ్లు చేస్తున్న వీడియోలు పదే పదే తెరపైకి వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయో.. ఎవరికీ అర్థం కావడం లేదు కానీ.. ఓ రకమైన మైండ్ గేమ్ మాత్రం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రైస్తవులైతేనే ఉద్యోగాలు వస్తాయన్న అభిప్రాయాన్ని… క్రైస్తవులయితే.. ప్రభుత్వం సాయం చేస్తున్న ఆలోచనను ప్రజల్లో కలిపించే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న కన్వెర్టెడ్ క్రిస్టియన్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఇదే భావాన్ని ప్రజల్లోకి పంపుతున్నారనడానికి.. గుంటూరు కలెక్టర్ శామ్యూల్ జాన్సన్ మాటలే నిదర్శనమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుల, మత రాజకీయాలు… ప్రజలకు ఏ మాత్రం మంచి చేయవు. రాజకీయ పార్టీలకు మాత్రం మంచి చేస్తాయి. రాజకీయ పార్టీల లక్ష్యం.. ప్రజలకు మంచి చేయడమే అయి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ.. కొన్ని రాజకీయ పార్టీలు.. అధికారం అందిన తర్వాత దాన్ని శాశ్వతం చేసుకునేందుకు… అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఇలా మత రాజకీయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని పరిణామాలు ప్రజలకు అర్థమైతేనే.. కానీ..అసలు చైతన్యం రాదు.
గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ క్రైస్తవ బిడ్డల గురించి , ఈ సంవత్సరం ఆంధ్రలో గవర్నమెంట్ ఉద్యోగాలు వేల మంది క్రైస్తవ బిడ్డలకే ఎలా వచ్చాయో బరి తెగించి ఎలా చెప్తున్నారో మీరే వినండి
Can Government servants participate in these meetings ?and talk like these ? shocked onlookers pic.twitter.com/tOdMDenFqN
— Telugu360 (@Telugu360) December 18, 2019