విశాఖలో కార్యానిర్వాహక రాజధాని పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ఆ పార్టీలో ఎవరూ నోరు మెదపలేదని పరిస్థితి. దూరమైపోతుందన్న ఆందోళన రాయలసీమ ఎమ్మెల్యేల్లో ఉంది. తమ ప్రాంతం నుంచి ఎలా తరలిస్తారన్న ఆవేదన… కోస్తా ఎమ్మెల్యేల్లో ఉంది. కానీ.. ఎవరూ నోరు మెదపలేరు. కానీ.. ఒక్క ఎమ్మెల్యే మాత్రం… నోరు విప్పారు. ఆయనే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మూడు రాజధానులపై జగన్ వ్యాఖ్యలపై గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పరిపాలన విభాగం ఓకేచోట ఉండాలని.. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ అమరావతిలోనే ఉండాలన్నారు.
ఇది తన అభిమతమని.. తన ఆలోచన.. అని జగన్‌కు కూడా ఇదే అంశాన్ని తెలియజేస్తానని స్పష్టం చేశారు. వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయాలని జగన్‌కు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయి ఉన్నామని.. మరోసారి ప్రజలు నష్టపోవడం సరికాదన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారని.. ప్రజలు అపోహలు పడవద్దని గోపిరెడ్డి సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా.. హైకమాండ్ చెప్పినట్లుగా మాట్లాడాల్సి ఉంటుంది.
దాన్ని మీరి ఒక్క మాట మాట్లాడినా వారికి పార్టీ నుంచి వార్నింగులొస్తాయి. ఏకంగా జగన్ అసెంబ్లీ ప్రకటించిన అంశంపైనే వ్యతిరేక ప్రకటన చేశారు. గోపిరెడ్డి ప్రకటనకు.. వైసీపీ నుంచి రెస్పాన్స్ రాకపోతే… దీన్ని కూడా.. ఆ పార్టీ వ్యూహంలో భాగంగానే గుర్తించాల్సిన పరిస్థితి. ఆగ్రహంతో ఉన్న కోస్తా వారిని సంతృప్తి పరిచేందుకు.. ఇలా… గేమ్ ఆడుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది.