మిలీనియం టవర్.. విశాఖ..! … విశాఖకు ఐటీ కంపెనీల్ని ఆకర్షించందుకు గత ప్రభుత్వం శరవేగంగా నిర్మించిన టవర్. ఇందులో పలు కంపెనీలకు స్పేస్ ఇచ్చారు. కాండ్యూయెంట్ కంపెనీ పదిహేను వందల మంది ఉద్యోగులతో కార్యకాలాపాలు ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 15న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాండ్యుయెంట్ ఐటి సంస్థతో ఎంఒయు కుదర్చుకున్నారు. మిలీనియం టవర్లో టవర్ ఎ, బి రెండు భాగాలుండగా ‘ఎ’ భాగంలో కాండ్యుయెంట్కు ఇచ్చారు. 500 కార్ల పార్కింగ్ కోసం టవర్ ‘ఎ’ లోనే రెండు ఫ్లోర్లు కేటాయించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత… కాండ్యూయెంట్ కంపెనీని కూడా.. ఆ టవర్ నుంచి బయటకు పంపేసే చర్యలు ప్రారంభించారనే వార్తలు గుప్పుమన్నాయి.
ఇప్పుడు.. ఆ మిలీనియం టవర్లోనే…సీఎం క్యాంప్ కార్యాయం పెట్టబోతున్నారని.. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఐటి మిలీనియం టవర్ కోసం విశాఖ జిల్లా మధురవాడ ఐటి సెజ్ రుషికొండ హిల్ నెంబరు మూడులో రూ.150 కోట్ల వ్యయంతో చంద్రబాబు నిర్మించారు. టవర్ను శరవేగంగా 2018లో ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. ప్రస్తుతం.. గత ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలు కూడా..విశాఖకు రావడానికి వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటిని ఆహ్వానించడం లేదు.
దీంతో మధురవాడ ఐటి సెజ్ హిల్ నెంబర్-3, ఐటి పార్కు హిల్ నెంబరు-2, హిల్ నెంబరు-1 రుషికొండల్లో స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఆదానికి ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. చివరికి… అటూ ఇటూ తిరిగి.. చంద్రబాబు కట్టించిన భవనాలే.. విశాఖ రాజధానికి అవసరం అయ్యాయనే సెటైర్లు అప్పుడే ప్రారంభించాయి. అయితే.. ఇవి ముఖ్యమంత్రి వరకూ వెళ్తే.. వెంటనే.. క్యాన్సిల్ చేస్తారన్న జోకులు కూడా.. విశాఖలో పడుతున్నాయి.