కర్నూలులో హైకోర్టు పెట్టాలని… రాయలసీమ డిక్లరేషన్లు చేసినా… బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల… జిరాక్స్ మెషీన్లు పెట్టడం తప్ప.. ఏమి ప్రయోజనం ఉంటుందని.. ప్రశ్నిస్తున్నారు. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక విష్ణువర్దన్ రెడ్డికి నచ్చలేదు. కర్నూలులో హైకోర్టు పెట్టి… అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు పెట్టాలని సిఫార్సు చేయడంతో… కర్నూలు హైకోర్టు.. కాస్తా.. నాలుగు జిల్లాల హైకోర్టుగా మారిపోయింది. బహుశా ఇదే.. విష్ణువర్ధన్ రెడ్డికి అసంతృప్తి కలిగించి ఉండవచ్చు. ఈ అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఆయన… జిరాక్స్ మెషీన్లు మాత్రమే పెరుగుతాయని.. ఇంకేం లాభం లేదని చెప్పుకొచ్చారు.
హైకోర్టు వల్ల అదొక్కటే లాభం అనుకుంటే.. దాని కోసం… బీజేపీ డిక్లరేషన్లు చేసి.. సెంటిమెంట్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అమరావతిలో హైకోర్టు పెట్టడం వల్ల.. అభివృద్ది అంతా అక్కడే కేంద్రీకరించారని… చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోతుంది. అమరావతిలో అయినా.. జిరాక్స్ మెషీన్లే పెరుగుతాయి. అంతకు మించి ఉపయోగం ఏమి ఉంటుంది. పైగా.. అమరావతిలో హైకోర్టు ఉండటం వల్ల… అన్ని ప్రాంతాల వారికీ సమదూరంలో ఉన్నట్లుగా ఉంటుంది. కానీ.. అమరావతిపై… విద్వేషం రగిలించడానికి గతంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడిన దానికి ఇప్పుడు.. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి జీఎన్ రావు కమిటీ సిఫార్సు చేసిన తర్వాత మాట్లాడుతున్న దానికి పొంతన లేకుండా పోయింది.
రాయలసీమ ప్రజలకు సచివాలయం దూరం అయిపోతోందన్న బాధ విష్ణువర్ధన్ రెడ్డికి కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా ఉంది. ఆయన.. సెక్రటేరియట్.. అసెంబ్లీ ఒకేచోట ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అదీ కూడా అమరావతిలోనే ఉండాలని అంటున్నారు. అయితే.. అది అమరావతిపై ప్రేమతో కాదు.. సీమకు.. దూరం అయిపోతుందన్న భయంతోనేనని ఆయన మాటలతోనే అర్థమైపోతుంది. ప్రభుత్వాలను ఇక ఏ విషయంలోనూ నమ్మకూడదన్న భావన… కల్పించేలా.. రైతులకు అన్యాయం జరుగుతున్నా…. బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు కానీ.. చిన్న చిన్న విషయాలపై స్టేట్మెట్లకు మాత్రం కొదవలేకుండా చేస్తున్నారున్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.