రాజధాని రీ లొకేషన్ పూర్తి కాక ముందే ఏపీ సర్కార్ మరో మిషన్ ముందేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ విధివిధానాలను డిసైడ్ చేయగల పవర్ ఉన్న.. విజయసాయిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆలోచలను.. విశాఖలో ప్రజల ముందు ఉంచారు. ఆ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చిన విషయం ఇరవై ఐదు జిల్లాలు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ జిల్లాను విడగొట్టాలని.. జగన్మోహన్ రెడ్డి… అధికారం చేపట్టిన తర్వాత నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. కారణం ఏమిటో కానీ.. ఆ తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ కొత్త జిల్లాల ఆలోచన ఎప్పుడు చేస్తారనే ప్రశ్న వచ్చినప్పుడల్లా… భూముల రీసర్వే జరుగుతోందని… అది అయిపోయాక చేస్తామన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
తర్వాత కసరత్తు కూడా ఎక్కడిదక్కడ ఆగిపోయింది. దీనికి కారణం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయడంలో.. చాలా చిక్కులు ఉన్నాయి. దానికి గతంలో వైఎస్ హయాంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల డి-లిమిటేషనే కారణం. అర్థంపర్థం లేకుండా.. అప్పట్లో నియోజకవర్గాలను విభజించారు. దాంతో.. ఇప్పుడు.. ఆ నియోజకవర్గాలను కలుపుతూ.. జిల్లాలు చేయాలంటే.. చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం యంత్రాంగం.. మొత్తం దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఈ లోపు.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. వీటన్నింటి మధ్య.. జిల్లాల విభజన ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. రాజధాని రీ లోకేషన్ పూర్తయిన తర్వాత… ప్రజలకు మరో ఆలోచన లేకుండా… కొత్త జిల్లాల గురించి.. చర్చించడానికి అవసరమైంత స్టఫ్ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.