పౌరసత్వ చట్ట సవరణ…జాతీయ పౌరసత్వ రిజిస్టర్ పై… తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సమయంలో..కేంద్రం మరో కొత్త కాన్సెప్ట్ ను ప్రకటించింది . అదే ఎన్పీఆర్. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. దేశ పౌరులందరి సమాచారాన్ని అప్డేట్ చేస్తుందట. ఎన్ఆర్సీకి దీనికి ఎలాంటి సంబంధమూ లేదని కేంద్రం చెబుతోంది. జనాభా లెక్కల ప్రక్రియే తప్ప కొత్తదేమీ కాదని కేంద్రం నమ్మకంగా చెబుతోంది. యూపీఏ-2 ప్రభుత్వం కూడా 2010లో తొలిసారి ఎన్పీఆర్ చేపట్టి గుర్తింపు కార్డులను మంజూరు చేసింది. ఆ సమాచారాన్ని 2015లో అప్డేట్ చేశారు. మరోసారి అప్ డేట్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే..దీన్ని అమలు చేయడం..రాష్ట్రాల ఇష్టం. ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతూండటంతో.. కొన్ని రాష్ట్రాన్ని దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేవు. అందుకే.. అమిత్ షా జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్యూలు ఇచ్చి మరీ.. ఎన్ఆర్సీతో ఎన్పీఆర్కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎన్పీఆర్ డాటాను ఎన్ఆర్సీ కోసం వాడుకోబోమని అంటున్నారు. ఎన్పీఆర్పై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ హక్కును తొలగించే నిబంధనలు పౌరసత్వ సవరణ చట్టంలో లేవంటున్నారు.
ప్రస్తుతం చేపట్టిన ఎన్పీఆర్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరుతున్నాననంటున్నారు. అయితే.. జనాభా లెక్కలు అయినా.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో… వివాదానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. అయినా కేంద్రం.. ముందుకే వెళ్తోంది. ఈ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజల సెంటిమెంట్ కే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అమలు చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.