విశాఖకు రాజధాని ప్రకటించిన సీఎం జగన్ ఆ స్థాయి అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారు. ఇరవై ఎనిమిదో తేదీన.. కనీసం పదిహేను వందల కోట్ల విలువైన పనులకు.. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులన్నింటికీ పాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడలో బయోమైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కు రూ. 22.50 కోట్లు,కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ.37 కోట్లు , సిరిపురం జంక్షన్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రిసెర్చ్ సంస్థకు రూ.88 కోట్లు , చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణానికి రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణానికి రూ.75 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వీటితో పాటు మరికొన్ని పనులకు జగన్.. శంకుస్థాపనలు చేస్తారు. రాజధాని సిటీకి ఉండాల్సిన మౌలిక సదుపాయాలను విశాఖకు శరవేగంగా కల్పించడానికి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సెక్రటేరియట్ వస్తుందని భావిస్తున్న కాపులుప్పాడ వైపే.. ఎక్కువగా అభివృద్ధి పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. రాజధాని వస్తే.. విపరీతమైన అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారానికి తగ్గట్లుగానే దూకుడుగా.. విశాఖను మార్చి చూపాలని.. జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వారం.. క్రిస్మస్ వేడుకల కోసం.. సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లిన జగన్‌కు.. ఆ నియోజకవర్గానికి రూ.పదిహేను వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారు. జీవోలు ఇచ్చారు. ఇప్పుడు ఆ చాన్స్విశాఖకు దక్కింది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలు తమకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వాలని కోరుతున్నారుకానీ.. జగన్ వారికి ఖజానా ఖాళీ అని చెబుతున్నారు. ఆయన ఆయన ఇవ్వాలనుకుంటున్నవాటికి మాత్రం కొరత ఉండటం లేదు.