ఓ పాడైపోయిన హార్డ్ డిస్క్ దొరికింది. అందులో ఏదో ఉందన్న అనుమానం వచ్చింది. మొదట తాము తీసి చూశారు. ఏమీ కనిపించలేదు. తాము లోకల్ నిపుణులం కాబట్టి.. తెలియదేమోనని.. జిల్లా రేంజ్‌కి పంపారు. అక్కడా ఏమీ కనిపించలేదు.. ఆ తర్వాత.. రాష్ట్ర స్థాయి.. దేశ స్థాయి నిపుణులకు పంపారు. కానీ ఎవరికీ ఏమీ దొరకలేదు. అయినా సరే ఏదో ఉందన్న అనుమానంతో అంతర్జాతీయ స్థాయికి పంపుతున్నారు. ఇది మోడీ హత్యకు కుట్ర చేశారంటూ.. కొన్నాళ్ల కిందట.. పుణె పోలీసులు నమోదు చేసిన కేసులో … విచారణ తీరు. మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ.. తెలుగు వ్యక్తి .. హక్కుల నేత గా ఉన్న వరవరరావు పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అలా చేశారనడానికి ఆధారాలు ఏమీ దొరకలేదు.. ఒక్క హార్డ్ డిస్క్ తప్ప. ఆ హార్డ్ డిస్క్‌లో తవ్వకాలు జరిపితే ఏమీ దొరకలేదు. కనీసం. .ఎఫ్‌బీఐకి అయినా.. ఏమైనా తెలుస్తుందోనని.. ఇప్పుడు అమెరికా సాయం తీసుకుంటున్నారు.
నిజానికి ప్రధాని హోదాలో ఉన్న మోడీ హత్యకు కుట్ర జరిగితే .. కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీలు క్షణం ఆగకుండా రంగంలోకి దిగుతాయి. కానీ ఇప్పటికీ… కేసును పుణె పోలీసులే విచారిస్తున్నారు. వరవరరావు సహా పలువురిపై అత్యంత కఠినమైన UAPA కేసు నమోదు చేశారు. దేశంలో ఇప్పటికే..ఐదుగురి పై మాత్రమే ఈ యాక్ట్ నమోదు చేశారు. ఈ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 15,16,17 కింద కేసు పెట్టారు. అంటే.. ఆయనను టెర్రరిస్ట్ గా చూపించారు. ఆ కేసులో వరవరరావును మాత్రమే కాదు.. . దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హక్కుల నేతలందర్నీ అరెస్టు చేశారు. మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు కొన్ని లేఖలను పుణె పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
అప్పట్నుంచి అందరూ.. జైల్లోనే ఉన్నారు. ఉగ్రవాదులుగా ముద్రవేసి.. ఆ చట్టాల కిందే.. అరెస్ట్ చేయడంతో.. వారికి బెయిల్ దొరకడం లేదు. ఎంత కాలమైనా నిరూపించే పరిస్థితి లేకపోవడంతో.. పుణె పోలీసులు ఇప్పుడు ఎఫ్‌బీఐ సాయం తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఇంత గొప్ప విచారణ వ్యవస్థలు .. టెక్నాలజీ పెట్టుకున్న దేశానికి.. ఎఫ్‌బీఐ సాయం కావాల్సి వచ్చిందన్న విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి.