ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా జగన్ను.. నయా తుగ్లక్గా పరిచయం చేశారు ప్రసిద్ధ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా. అమరావతిని నిలిపివేస్తూ.. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. దాని వల్ల వచ్చే అనర్థాలను.. ఏపీనే కాదు.. దేశం మొత్తం ఎదుర్కోబోతోందని.. స్పష్టంగా చెప్పారు. డిజాస్టర్ లాంటి .. నిర్ణయాలను అడ్డుకునే బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు. జగన్ నిర్ణయాలు తుగ్గక్ కంటే ఘోరంగా ఉన్నాయన్నారు. అమరావతి విషయంలో జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని విశ్లేషణాత్మకంగా… వీడియోను విడుదల చేశారు ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా. బుద్ది, జ్ఞానం ఉన్న వాళ్లెవరూ.. అమరావతి విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోరని.. తేల్చేశారు.
శేఖర్ గుప్తాకు జగన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. బహుశా.. దానికి కారణం.. ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం కావొచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. శేఖర్ గుప్తాకు మంచి గౌరవం ఇచ్చారు. సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు. ఆ కారణంగానే.. శేఖర్ గుప్తాకు జగన్ అంటే.. అభిమానం ఉండి ఉంటుంది. అదే సమయంలో.. జగన్ కు కూడా.. శేఖర్ గుప్తాపై మంచి అభిమానమే. జగన్ చాలా పరిమితంగా.. తన ట్విట్టర్ హ్యాండిళ్లో… జర్నలిస్టులను ఫాలో అవుతారు. ఆ పరిమితమైన వ్యక్తుల్లో శేఖర్ గుప్తా ఒకరు. అందుకే కాదు..జగన్మోహన్ రెడ్డి .. ఏపీలో గెలిచినప్పుడు.. అమరావతికి వచ్చి అభినందనలు తెలిపారు. జగన్ పాదయాత్రపై.. సాక్షి మాజీ ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే.. జగన్ పై తన అభిమానాన్ని ఎంతగా దాచుకోవాలన్నా.. ఆయన నిర్ణయాలను చూసి దాచుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి శేఖర్ గుప్తా.. దక్షిణాది విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు. చాలా తక్కువగా స్పందిస్తూంటారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయాలపైనే మాట్లాడతారు. ప్రత్యేకంగా అమరావతి గురించి.. దాదాపుగా అరగంట పాటు విశ్లేషణ చేశారంటూ.. జగన్ అమరావతిని నిలిపివేయాలనే నిర్ణయం ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో.. అంచనా వేసి ఉంటారంటున్నారు.