రవితేజ సినిమా డిస్కోరాజా ఈ యేడాదే రావాల్సింది. షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండడంతో.. రిలీజ్ డేట్ మార్చారు. జనవరి 24న ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు జనవరి 24 కూడా డౌటే అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన డీఐతో రవితేజ సంతృప్తికరంగా లేడని, డీఐ మళ్లీ చేయాల్సివస్తోందని తెలుస్తోంది. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందట. ఎంత వేగంగా చేసినా జనవరి 24న సినిమా తీసుకురావడం కష్టమని చిత్రబృందం భావిస్తోంది. అందుకే.. ఓ వారం ఆగి వద్దామని ప్లాన్ చేస్తున్నారు. జనవరి 31 అయితే.. డిస్కోరాజా రావడానికి సిద్ధమే. ఎందుకైనా మంచిదని రెండో డేట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓవారం ఆలస్యమైనా ఫర్వాలేదని, క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని రవితేజ గట్టిగా చెబుతున్నాడట. వీలైనంత వరకూ 24నే ఈ సినిమాని తీసుకురావడానికి, కుదరని పక్షంలో ఓ వారం వాయిదా వేయడానికి చిత్రబృందం ఫిక్సయిపోయింది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేషా, పాయల్ రాజ్పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు.