ఛలో తరవాత ఒక్కసారిగా నాగశౌర్య రేంజ్పెరిగింది. యువ హీరోల రేసులో దూసుకొచ్చాడు. అయితే..నర్తనశాల బాగా నిరాశ పరిచింది. తన సొంత బ్యానర్లో చేసిన సినిమా కావడంతో ఆ పరాజయం మరింత ఇబ్బంది పెట్టింది. `ఓ బేబీ`లో నటించినప్పటికీ అది శౌర్య సినిమా కాదాయె. పేరంతా.. సమంత పట్టుకెళ్లిపోయింది. అందుకే… ఈసారి కాస్త గట్టిగానే కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే మరోసారి తన సొంత సంస్థలో `అశ్వథ్థామ` తెరకెక్కించాడు. తన స్నేహితుడినే దర్శకుడిగా ఎంచుకున్నాడు.
`అశ్వథ్థామ` చాలా మాస్, పవర్ఫుల్ టైటిల్. చాక్లెట్ బోయ్, లవర్‌బోయ్ ఇమేజ్ ఉన్న శౌర్యకి సరిపోతుందో లేదో అని సందేహించారంతా. కానీ టీజర్ చూశాక… ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. టీజర్ మాసీగా ఉండి, రేసీ స్పీడుతో సాగిపోయింది. కంటెట్ ఉన్న సినిమాలానే కనిపించింది. టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ పొజీషన్లో ట్రేడింగ్‌లో ఉంది. పెద్ద హీరోల సినిమాలకు వచ్చే వ్యూస్ ఈ సినిమాకి లభించాయి. ఓ యువ హీరో సినిమా టీజర్ ఈ స్థాయిలో జనంలోకి వెళ్లడం నిజంగానే అరుదు. టీజర్లో హిట్టు లక్షణాలు కనిపిస్తున్నాయి. నాగశౌర్య కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. `నా తల్లిదండ్రులు తలెత్తుకునే సినిమా తీశా` అని సగర్వంగా చెబుతున్నాడు. మరి నాగశౌర్య జడ్జిమెంట్ ఏ స్థాయిలో నిజం అవుతుందో తెలియాలంటే జనవరి 31 వరకూ ఆగాలి.