రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పని చేయాలంటే.. కచ్చితంగా అధికారిక ఉత్తర్వులుండాలి. జీవో రూపంలో.. బయటకు రావాలి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే సంస్థ.. నివేదిక ఇస్తుందని… ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పే వరకూ.. ఆ సంస్థకు బాధ్యతలు ఎప్పుడిచ్చారో ఎవరికీ తెలియదు. రాజధానిపై అధ్యయనం చేయమన్న జీవో కూడా జారీ కాలేదు. ఎప్పుడు నియమించారో, ఎవరు నియమించారో కూడా తెలీదు. అందుకే ఈ బీసీజే నివేదికపై.. ముందు నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బీసీజే గురించి జగన్ చెప్పారు. కానీ రూర్కీ ఐఐటీ నిపుణుల కమిటీ గురించి చెప్పలేదు.
ముఖ్యమంత్రి జగన్ నోటి వెంట వచ్చిన బీసీజీ గ్రూప్ మాట, కేబినెట్ లో కూడా ప్రధానంగా చర్చకు రావటంతో అటు ప్రతిపక్షాలతోపాటు, ఇటు నెటిజన్లు కూడా అసలు ఈ గ్రూప్ కథేమిటో వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఇది కావాల్సినట్లు రిపోర్టులిచ్చి డబ్బులు వసూలు చేసే సంస్థగా తేలిది. ఈ గ్రూప్ అవినీతి పాల్పడటంతో పోర్చ్ గ్రీస్ పోలీసులు సంస్థపై సోదాలు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇండియా డైరెక్టర్ బట్టాచార్యా. ఆయనకు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఫ్రెండ్. ఈ రోహిత్ రెడ్డి.. అరబిందో ఫార్మా వారసుడు. విశాఖపట్నం, విజయనగరం మధ్యన అరబిందో ఫార్మా పేరుతో.. గత ఆరు నెలల కాలంలో కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ వివరాలన్నీ.. సోషల్ మీడియాలో హైలెట్ కావడం…. ఒక దాని తర్వాత ఒకటి బయటకు రావడం.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏ చట్టబద్ధతతో .. జీఎన్ రావు కమిటీని వేశారో.. ఏ ఆదేశాలతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ను సంప్రదించారో.. వారి రిపోర్టులతో అమరావతిని ఎందుకు డిసాల్వ్ చేయాలనుకుంటున్నారో.. ఎవరికీ అర్థం కావడంలేదు. మొత్తానికి వ్యవహారం మాత్రం మొత్తం గూడుపుఠాణిలా కనిపిస్తోందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.