చంద్రబాబు నోట కూడా అదే డిమాండ్ వచ్చింది. అమరావతి రాజధానిగా ఉండాలా..వద్దా అనే దాన్ని ఎజెండాగా చేసుకుని రిఫరెండం ఎన్నికలకు వెళ్లి .. ఎన్నికల్లో గెలిచి.. తాను అనుకున్నట్లుగా చేయాలని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. మూడు రోజుల కిందట… సీపీఐ నేత నారాయణ .. రాజధానిని మార్చాలనుకుంటే .. రాజధాని మార్పు అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి.. ఎన్నికలకు వెళ్లి గెలిచి.. రాజధానిని మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దాన్ని టీడీపీ అధినేత అందిపుచ్చుకున్నారు. సాధారణ జనాలలో కూడా.. ఈ అంశంపై చర్చ పెట్టేందుకు పెద్ద ఎత్తున అఖిలపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజధాని మార్చాలంటే.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలన్న డిమాండ్‌ను పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. అమరావతి గురించి మీడియాతో మాట్లాడుతున్న ప్రతి విపక్ష నేత.. జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్‌నే వినిపిస్తున్నారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబు కూడా అదే డిమాండ్ చేశారు. నిజానికి రాజధానిని మార్చబోమని ప్రజలను నమ్మించిన వైసీపీ నేతలు…ఓట్లు వేయించుకున్నారు. రాజధాని గ్రామాల్లోనూ.. వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడటమే దీనికి కారణం. జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు కట్టుకున్నారని.. రాజధానిని ఎందుకు మారుస్తారని.. వైసీపీ నేతలు ప్రచారం చేశారు.
జగన్ కూడా.. తనకు రాజధానిలో సొంత ఇల్లు కూడా అమరావతిలో కట్టుకున్నానని చెప్పారు. అసెంబ్లీతో పాటు అన్ని చోట్లా .. జగన్ అమరావతికి మద్దతిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చాలని నిర్ణయించడంతో.. మడమ తిప్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిపై ఎన్నికల రూపంలోప్రజాభిప్రాయం తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతూండటంతో.. వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో అ