‘నేను మాట తప్పను మడమ తిప్పను’ అని చెప్పుకునే జగన్ ఇటీవలి కాలంలో మడమ తిప్పడం లో స్పెషలిస్ట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ముందు చెప్పిన వాటికి, ఇప్పుడు చేస్తున్న వాటికి పొంతన లేకుండా ఉందని జనాలు జగన్ తీరు పై అభిప్రాయపడుతున్నారు. రాజధాని విషయంలో ఎన్నికలకు ముందు గొప్ప మోడల్ సిటీని కడతానని, ఎలా కడతామో చూడాలని, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కడతామని జగన్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్నికలకు ముందు గొప్ప రాజధాని కొడతాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు:
.@ysjagan before elections :
“ ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా , చెయ్యక పోయినా కూడా హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాము
ఎలా కడతాము అన్నది ..మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల్లో నుంచి కడతాం ! “
Now he is attempting U Turn !@PawanKalyan @JayGalla @GVLNRAO @rammadhavbjp pic.twitter.com/esAt2NTxND
— Telugu360 (@Telugu360) December 31, 2019
Before Elections :
ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఓ యూఫోరియాను క్రియేట్ చేస్తాంమనకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఆ మోడల్ సిటీని “కొత్తగా“ కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో , అటువంటి నగరాలనో ఇక్కడకు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కారణం “ ఇవాళ “ కడుతున్నాం
Listen more: pic.twitter.com/ApR73kZWOG
— Telugu360 (@Telugu360) December 31, 2019
ఎన్నికలకు ముందు రాజధాని విషయంలో జగన్ మాట్లాడుతూ తాను కట్టబోయే ప్రపంచస్థాయి క్యాపిటల్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు- “ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఓ యూఫోరియాను క్రియేట్ చేస్తాం. మనకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఆ మోడల్ సిటీని “కొత్తగా“ కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో , అటువంటి నగరాలనో ఇక్కడకు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కారణం ఇవాళ కడుతున్నాం. కాబట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ – రోడ్స్ దగ్గరనుండి బిల్డింగ్స్ దగ్గరనుండి గ్రీనరీ దగ్గరనుండి ప్రతి అంశంలోనూ ఒక మోడల్ సిటీ ఎలాగా నిర్మిస్తాం. అలాంటి మోడల్ సిటీని ప్లాన్ చేస్తాం. అక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే టాప్ క్లాస్ స్కూల్స్, యూనివర్సిటీస్ , మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వస్తాం. ఆ విధంగా క్యాపిటల్ సిటీ చుట్టూ ఓ యూఫోరియాను క్రియేట్ చేస్తాం. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా , చెయ్యక పోయినా కూడా హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాము. ఎలా కడతాము అన్నది ..మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల్లో నుంచి కడతాం ! “ – ఇవీ జగన్ చేసిన వ్యాఖ్యలు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలోని ఆర్కే వంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, రాజధాని విషయంలో ఆ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల తర్వాత:
ఎన్నికలకు ముందు అంత గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన జగన్, ఎన్నికలు అయిపోగానే మాట మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొత్త నగరాన్ని కట్టడం కానీ అమరావతిని కట్టడం కానీ సాధ్యం కాదని, ఇప్పటికే కాస్తోకూస్తో అభివృద్ధి చెందిన విశాఖపట్నం ని రాజధానిగా చేసుకుంటే బాగుంటుందని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందేమో కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా ప్రపంచస్థాయి రాజధాని కడతామని, అది ఎలా కట్టాలో మా బుర్రలో ఆలోచన ఉందని చెప్పిన జగన్, ఇప్పుడు మాట మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో అప్పట్లో రాజధాని విషయంలో భరోసా ఇచ్చిన ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రజలకు ముఖం చాటేయడం గమనార్హం.
మడమ స్పెషలిస్ట్ జగన్:
రాజధాని విషయంలోనే కాకుండా పలు అంశాల లో జగన్ మడమ తిప్పుతున్నాడు అంటూ విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ ఎన్నికలయ్యాక 250 రూపాయలు పెంచి 2250 చేశారు. పాదయాత్రలోను, వైఎస్ఆర్సిపి ప్రచారంలోనూ పెన్షన్ 3000 చేస్తానని చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి, మేనిఫెస్టోలో మూడు వేల వరకూ పెంచుకుంటూ పోతాం అని చెప్పాను తప్పించి ఒకేసారి 3000 కి పెంచుతాం అనలేదంటూ అడ్డగోలుగా వాదించారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా కేవలం కొన్ని కులాల వారికే వర్తింపజేస్తాం అని ఎన్నికలయ్యాక చెప్పడం, అమ్మ ఒడి విషయంలో కూడా ఒక బిడ్డకే ఇస్తామని అనడం, ఇలా పలు విషయాల్లో జగన్ మడమ తిప్పుతున్నారు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి మడమ తిప్పడం లో జగన్ ఆరితేరి పోయాడని అప్పటి జగన్ వ్యాఖ్యలను, ఇప్పటి జగన్ తీరును చూసిన వాళ్లు అంటున్నారు.