చిరంజీవి – మోహన్ బాబులది టామ్ అండ్ జెర్రీ సంబంధం. వేదికపై ఎప్పుడు కలిసినా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటుంటారు. చిరు ఓ మాట అంటే, మోహన్ బాబు మరో మాట అంటాడు. అదంతా సరదా, ఆట విడుపు. `మా` డైరీ ఆవిష్కరణ సభలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. మోహన్ బాబు వయసు ప్రస్తావన వచ్చినప్పుడు వెనుక ఉన్న చిరంజీవి ఓ సెటైర్ వేశాడు. మోహన్ బాబు మరో డైలాగ్ పేల్చాడు. దాంతో వాతావరణం తేలికపడింది. కృష్ణంరాజు మైకు అందుకుని ‘పరిశ్రమలో ఇలాంటి వాతావరణమే నేను కోరుకున్నది’అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
మోహన్ బాబు కూడా ‘నా కుటుంబం చిరు కుటుంబం. తన కుటుంబం నా కుటుంబం. మా ఇద్దరి అనుబంధం అలాంటిది. ఒకరిని ఇంకొరకం ఏమైనా అనుకుంటే అది సరదాకి మాత్రమే’ అనేసరికి వెనుక ఉన్న చిరంజీవి మోహన్ బాబుని ఆత్మీయంగా కౌగిలించుకుని ఓ ముద్దు పెట్టుకోవడం సభని ఆకట్టుకుంది.
అంతకు ముందే రాజశేఖర్ సభలో ఆగ్రహావేశాలు వక్తం చేసి, సభ నుంచి బాయ్ కాట్ చేయడంతో రసాభసగా మారిన వాతావరణం.. చిరు మోహన్ ముద్దులాటలతో తేలికపడింది.