వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా.. ఇలాంటి వినతితోనే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదినారాయణరెడ్డి కూడా.. హైకోర్టులో మరో పిటిషన్ వేసారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను పోలీసులు ఎలూ తేల్చడం లేదు. విచారణ పేరుతో టైంపాస్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా.. ఇలాంటి పిటిషన్లు కోర్టుల్లో వేసినప్పుడు… ఫలానా వ్యక్తిని విచారిస్తున్నామంటూ.. మీడియాకు లీక్ చేస్తున్నారు. తర్వాత సైలెంటయిపోతున్నారు.
నిజానికి క్రైమ్ జరిగిన విధానం.. అక్కడ సాక్ష్య్లాలను తుడిచేయడానికి జరిగిన ప్రయత్నం.. దారుణమైన హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలను.. ఒకదానికి ఒకటి ముడిపెట్టి చూస్తే.. కేసును పరిష్కరించడం.. గంటల్లో పని. ఓ సాధారణ కానిస్టేబుల్ కూడా… ఈ కేసును చేధించి చూపించగలరన్న చర్చ సామాన్యుల్లో నడుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు సహా.. ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ.. పోలీసులు మాత్రం… నార్కో టెస్టులు సహా.. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు కావాలనే నిందితుల్ని రక్షిస్తున్నారని.. రాజకీయ కారణాలతో ప్రత్యర్థుల పేర్లను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు రావడానికి కారణం అవుతున్నాయి.
పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతూండటంతో.. ముందు జాగ్రత్తగా.. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి లాంటి నేతలు.. సీబీఐ విచారణ కోసం.. హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికలకు ముందు.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐకి కేసు విచారణ ఇవ్వాలని.. గతంలో హైకోర్టులో పిటిషన్లు వేసిన.. జగన్.. వివేకా కుటుంబసభ్యులు.. ఇప్పుడు కేసు విచారణ సాగకున్నా.. మౌనంగానే ఉన్నారు. కోర్టులో.. ప్రబుత్వం ఏ వాదన వినిపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.