మనసంతా నువ్వే, వర్షం లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఎమ్మెస్ రాజు పేరు మార్మోగిపోయింది. ఆ తరవాత ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేయడం, వరుస పరాజయాలు పలకరించడంతో వైభవం తగ్గిపోయింది. కొంతకాలంగా ఆయన కనిపించడమే మానేశారు. ఇప్పుడు మరోసారి మెగాఫోన్పట్టారు. సైలెంట్‌గా ఓ సినిమా పూర్తి చేసేశారు. దానికి `డర్టీ హరి` అనే పేరు పెట్టారు. ఈ సినిమా చాలా బోల్డ్‌గా ఉంటుందని, ఓ సామాజిక అంశాన్ని తాము కొత్త కోణంలో చూపిస్తున్నామని చెబుతున్నారు ఎమ్మెస్ రాజు.
‘బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ గా ఉన్నా బ్యూటిఫుల్ గా, క్లాసికల్ గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గాను, పొయెటిక్ గాను మలిచాను. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు. బోల్డ్కీ, బూతుకీ చిన్న పాటి గీత ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే ఫర్వాలేదు. లేదంటే మాత్రం ఫలితాలు తేడాగా వస్తాయి. మరి రాజుగారు ఏం చేస్తారో?? త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తున్నారు. అది చూస్తే ఈ సినిమాపై ఓ అభిప్రాయానికి రావొచ్చు.