వైఎస్ హయాంలో కీలక మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు.. అక్రమాస్తుల కేసులో నిందితడిగా ఉన్నారు. అక్రమాస్తుల కేసుల్లో రెవిన్యూ మంత్రిగా ఆయన జరిపిన భూకేటాయింపులు జరిపారని సీబీఐ కేసు పెట్టింది. అయితే.. గతంలో.. ఆయనపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్నారు. దీంతో సీబీఐ నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన మంత్రిగా దిగిపోయి చాలా కాలమయింది. దీంతో.. సీబీఐ .. ధర్మానపై అభియోగాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజానికి ఆయన మంత్రిగా దిగిపోయినప్పుడే.. సీబీఐ.. ధర్మానను నిందితుడిగా పరిగణనలోకి తీసుకోవాలని.. సీబీఐ కోర్టును కోరింది.
కానీ అప్పట్లో.. ధర్మాన కోర్టుకు వెళ్లారు. మంత్రిగా ఉన్నప్పుడు..విచారణకు తీసుకోలేదు కాబట్టి.. తర్వాత తీసుకోవడం చట్టవిరుద్ధమంటూ..సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్ విచారణ ఏ దశలో ఉందని.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని… ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా.. జగన్, విజయసాయిలో ప్రత్యక్షంగా హాజరవమని ఆదేశించిన పదో తేదీన విచారణలో చెప్పాలని ఆదేశించింది. ఈ పరిణామం.. ధర్మాన వర్గీయుల్లో గందరగోళానికి కారణం అవుతోంది. పలువురు మంత్రులు.. అక్రమాస్తుల కేసుల్లో.. జైలుకు వెళ్లినప్పటికీ.. ధర్మాన మాత్రం తప్పించుకున్నారు. దీనికి సాంకేతిక కారణాలను అడ్డు పెట్టుకున్నారు. ఇప్పుడు … ఆయనకు మంత్రి పదవి లేదు కాబట్టి.. న్యాయపరంగా ఆయన కేసులును ఎదుర్కోవాల్సి రావొచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై…సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకంటే… ఆయన కూడా.. జగన్, విజయసాయిరెడ్డిలతో పాటు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చంటున్నారు. మొత్తానికి ఇంత కాలం.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ.. కాస్త వెసులుబాటు దక్కించుకున్న ధర్మానకు.. ముందు ముందు షాకులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.