పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదానికి పర్ఫెక్ట్ సాక్ష్యం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ. ఎందుకంటే.. ఆయన డబ్బులు తీసుకుని నటిస్తూంటారు. రాజకీయాల్లోనూ.. అలా చేశారో లేదో కానీ.. సినిమాల్లో మాత్రం ఆయన పెయిడ్ ఆర్టిస్ట్. అలా తన వృత్తిని గౌరవించుకోవాల్సిన ఆయన… రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ ఈసడించేశారు. అక్కడెవరూ రైతులు లేరని.. అంతా పెయిడ్ ఆర్టిస్టులేనని.. ఇతర వైసీపీ నేతల్లా.. తాను కూడా..వారిపై ఓ రాయి వేశారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తూండటంపై వైసీపీ నేతలు ఒక్కరూ సానుభూతి చూపకపోగా.. వారిని నానా రకాలుగా మానసిక క్షోభకు గురి చేసే విధంగా మాట్లాడుతూ.. వారి ఆగ్రహానికి గురవుతున్నారు.
భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని.. నిజంగా పెయిడ్ ఆర్టిస్టులే హేళన చేయడం.. ఇందులో కొత్త కోణం. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ లాంటి వాళ్లను కూడా.. వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా.. రైతులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి.. రాజధాని అంశానికి సంబంధమే లేదు. ఆయన ఎస్వీబీసీ చానల్ కు చైర్మన్. కానీ.. కావాలనే.. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నది మాత్రం స్పష్టం.
సినిమా ఇండస్ట్రీ… ఆంధ్రప్రదేశ్ సమస్యలపై స్పందించడం లేదనే… విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్న సమయంలో.. ఫృధ్వీ ఇలాంటి.. విమర్శలు చేయడం కూడా కాక రేపే అవకాశం కనిపిస్తోంది. పెద్ద సినిమాను బహిష్కరించాలనే పిలుపును రాజధాని రైతులు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఫృధ్వీ వారిని ఇండస్ట్రీపై మరింతగా రెచ్చగొట్టే కోణంలోనూ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏదైనా.. కానీ రాజధాని రైతుల ఆందోళనను.. అందరూ శక్తివంచన లేకుండా.. తమ తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారన్నది మాత్రం స్పష్టమవుతోది.