ఆంధ్రుల రాజధాని అమరావతి. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు.. దీన్ని ఓ సెంటిమెంట్‌గా మార్చడానికి విశ్వప్రయత్నం చేశారు. అందరితీ రాజధాని అనే ఓ మానసికమైన అభిప్రాయాన్ని కల్పించేందుకు ఆయన.. ప్రజల దగ్గర్నుంచి రూ. పది కూడా విరాళాలు సేకరించారు. ఇటుకలు అమ్మారు. ఇలా.. దాదాపుగా యాభై కోట్ల రూపాయలకు విరాళాలు వచ్చాయంటే.. స్పందన ఎంత భారీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు.. కూడా.. విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా.. అమరావతి కోసమే. కాకపోతే.. అప్పుడు కట్టడానికి ఇప్పుడు.. కాపాడుకోవడానికి. అమరావతి పరిరక్షణ సమితి తమ ఉద్యమ కార్యకలాపాల్ని నిర్వహించుకోవడానికి ప్రజలే సాయం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలు స్పందిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట… చంద్రబాబు… రైతుల ఉద్యమానికి సంఘిభావం తెలిపేందుకు వెళ్లినప్పుడు.. ఆయన భార్య.. ప్లాటినం గాజుల్ని.. విరాళంగా ఇచ్చేశారు. అప్పట్నుంచి అమరావతి పరిరక్షణ సమితీకి విరాళాల రాక ప్రారంభమయింది. సోమవారం విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీక్ష కు.. చంద్రబాబు సంఘిభావం తెలిపారు. ఆ సందర్భంగా.. మరో మహిళ.. తన చేతికి ఉన్న నాలుగు బంగారు గాజుల్ని విరాళంగా ఇచ్చేశారు. ఆమెతో పాటు పలువురు… మరో ఐదు లక్షలు పోగేసి ఇచ్చారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు… జోలెపట్టి..సమీకరించిన రూ. అరవై వేలను ఇచ్చారు.
ఉద్యమంలో..అందరి భాగస్వామ్యాన్ని కల్పించి.. ఎమోషనల్ కనెక్టివిటీ పెంచేందుకు.. ఈ విరాళాల సేకరణ బాగా ఉపయోగపడుతుందని.. అమరావతి పరిరక్షణ సమితి కూడా భావిస్తోంది. కేవలం కోస్తా జిల్లాల నుంచే కాకుండా.. రాయలసీమ నుంచి కూడా.. అమరావతి పరిరక్షణ సమితికి మద్దతు లభిస్తూండటంతో.. వారికి ధైర్యం వస్తోంది. అందుకే.. రోజు రోజుకు.. వారి ఉద్యమం బలం పుంజుంటోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.