ప్రతీరోజూ పండగే సినిమాతో మరో సూపర్ హిట్టు కొట్టాడు మారుతి. ఇప్పుడు తన ముందు చాలా దార్లున్నాయి. వరుణ్‌తేజ్‌తో మారుతి ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలీదుగానీ, మారుతి మాత్రం రవితేజని దృష్టిలో ఉంచుకుని ఓ కథ సిద్ధం చేస్తున్నాడు. గీతా, యూవీ క్రియేషన్స్, డివివి దానయ్య… వీళ్లలో ఒకరు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది. రవితేజ ప్రస్తుతం `డిస్కోరాజా`తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ‘క్రాక్’ కూడా నడుస్తూవుంది. ‘డిస్కోరాజా’ ఈనెలలోనే విడుదల కాబోతోంది. ఆ తరవాత మారుతి రవితేజకు కథ వినిపించే అవకాశం ఉంది. మారుతి కథ నచ్చితే గనుక.. ఏప్రిల్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ చిత్రాలలలో కథానాయకుడికి ఓ విచిత్రమైన జబ్బు పెట్టి సక్సెస్ కొట్టాడు మారుతి. ఈసారి కూడా అలాంటి వైవిధ్యభరితమైన పాయింట్‌తోనే కథని రాసుకున్నాడని తెలుస్తోంది.