విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని బాధ్యత కేంద్రానిదని ఉందని.. కాబట్టి ప్రస్తుతం.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేందుకు సిద్ధమైన పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడి.. తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. వెంటనే అఖిపక్ష ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అమరావతి విషయంలో తమ విధానాన్ని ప్రకటించాలని.. పవన్ కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ముందుగా భూములు ఇచ్చిన రైతులతో చర్చించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. రైతులకు మాత్రం ఆన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్పు అంశం.. ఆనంతర పరిణామాలపై.. కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు… ప్రధానంగా.. అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ.. కేంద్రంలో ఉన్న పార్టీగా.. తాము చేయాల్సిన పని మాత్రం చేయడం లేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని చూపిస్తున్నారు. అమరావతి రైతులు కలిసినప్పుడు.. అమరావతి ఎక్కడికి పోదని చెబుతారు. వారు వెళ్లిపోయిన తర్వాత.. రాజధాని.. కేంద్రం పరిధిలోని అంశం కాదంటారు. ఇలా.. బీజేపీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తోదంన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వాన్ని అమరావతి అంశంలోకి లాగే ప్రయత్నం చేశారు. విభజన చట్టాన్ని సాక్ష్యంగా చూపించారు.
నిజానికి కేంద్రం గట్టిగా ఒక్క మాట అనుకుంటే.. జగన్మోహన్ రెడ్డి తన రాజధాని మార్పు ఆలోచలను ఎక్కడ కావాలంటే.. అక్కడ ఆపేసి.. సైలెంటయిపోతారు. ఎందుకంటే.. ఆయన వెనుక అంత లగేజీ ఉందని.. అందరికీ తెలుసు. కానీ.. ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం.. ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దాంతో.. రాజధాని మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి కానీ.. సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. పవన్ కల్యాణ్ గతంలో ఢిల్లీకి వెళ్లి.. ఓ సారి బీజేపీ అగ్రనేతలతో సమావేశమై వచ్చారన్న ప్రచారం జరుగింది. ఇప్పుడు పవన్ .. కేంద్రం బాధ్యత గురించి మాట్లాడటంతో.. రేపో మాపో.. ఈ అంశంపై.. కేంద్రం స్పందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.