వైసీపీ నేతల అసహనం.. హద్దు మీరిపోతోంది. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో బయటకు వస్తోంది. అమరావతిపై.. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ప్రజా మద్దతు దొరకలేదనో.. అమరావతి విషయంలో జరుగుతున్న రచ్చతో.. తమ నిర్ణయాన్ని ఎక్కడ వెనక్కి తీసుకోవాల్సి వస్తుందన్న ఆక్రోశంతోనో కానీ.. మొత్తానికి.. వైసీపీ నేతలు.. తమ నోటికి పని చెబుతున్నారు. స్థాయి.. భేదం లేకుండా ఎంత అంటే అంత మాటలు అనేస్తున్నారు.
చీప్ లిక్కర్ తాగుబోతుల భాషే వైసీపీ స్పెషల్..!
మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు.. ఎలా మాట్లాడతారో.. అచ్చంగా అదే లాంగ్వేజ్‌ని.. దింపేస్తున్నారు. నిన్నామొన్నటి వరకూ కొడాలి నాని.. ఆర్కే రోజా.. వల్లభనేని వంశీ తో పాటు.. మరికొంత మంది నేతలు.. హైలెట్ అయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం.. సోనియా గాంధీ – చంద్రబాబులపై సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు. వారందర్నీ మించి.. తానున్నానని దూసుకొచ్చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పక్కన మహిళ అయిన ఎంపీ వంగా గీత ఉన్నారని కూడా.. ఆయన మొహమాటం పెట్టుకోలేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లుగా వాగేశారు. ఆ కంపును.. వంగా గీత కూడా భరించలేకపోయారు.
రాజకీయంగా ఇరుక్కుపోయిన అసహనం బూతుల్తో బయటకు ..!?
ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేమని తెలిసినప్పుడు.. నోటికి పని చెప్పి..రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటారు ప్రత్యర్థులు. ఇప్పుడు వైసీపీది అదే పరిస్థితిలా ఉంది. రాజకీయాల్లో కొన్నాల్ల కిందటి వరకూ.. ఎంత ప్రత్యర్థి అయినా.. పేరు పెట్టి పిలిచేటప్పుడు గారు.. అని సంబోధిస్తూ ఉండేవారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి ఈ ట్రెండ్ ను మార్చేశారు. ఎప్పుడైతే.. ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం మానేసి.. ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారో.. అప్పట్నుంచే ఆ పార్టీ నేతలకు ఆయన ఆదర్శం అయిపోయారు. రోజా సహా.. ఎందరో నేతలు.. ఇలా బూతుల పంచాంగాన్ని వల్లే వేయడంలో రాటుదేలిపోయారు. ఎప్పుడూ.. కూడా.. ఆయా నేతల్ని వైసీపీ అగ్రనాయకత్వం… మందలించిన పాపాన పోలేదు. ఫలితంగా.. .. ద్వారంపూడి లాంటి వాళ్లు.. మైకుల్లోనే.. తమ భాషా ప్రయోగాలను చేస్తున్నారు.
ఆ లాంగ్వేజ్ వైసీపీ జీన్స్‌లోనే ఉంది..!
వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో పోలిస్తే.. ద్వారంపూడి బూతుపురాణం చాలా చిన్నదే. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. ఎదుటి పార్టీ వారిపై.. ఆ పార్టీ మహిళా నేతలపై.. వారి కుటుంబసభ్యులపై.. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అందరికీ తెలుసు. ఇలా చేసి.. ఆయా నేతల్ని మానసికంగా వేధించమని.. ఆ పార్టీ అగ్రనాయకత్వమే.. తమ పార్టీ సోషల్ మీడియాకు స్పష్టమైన సూచనలు ఇస్తుందన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇంత తెలిసిన తర్వాత ఆ పార్టీ నేతలు.. ద్వారంపూడిలా.. స్వేచ్చ తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇది ద్వారంపూడి తప్పు కాదు.. టోటల్‌గా వైసీపీ జీన్స్‌లోనే ఉన్న తప్పు..!