ఆంధ్రప్రదేశ్లో పోలీసులు, చట్టాలు అన్నీ… కొంత మంది కోసమే పని చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఒక్క వైసీపీ కోసం.. ఆ పార్టీ నేతల కోసమే పని చేస్తున్నాయి. అమరావతి గ్రామాల్లోనే కాదు.. పదమూడు జిల్లాల్లో ఎక్కడా.. అమరావతికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి పోలీసులు అనుమతించడం లేదు . చివరికి చంద్రబాబు ర్యాలీ ఉందని.. తిరుపతిలోనూ 144 సెక్షన్ విధించారు. అలాంటిది. వైసీపీ నేతలు ఎక్కడ పడితే అక్కడ.. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లోనే కాదు. ఎక్కడైనా.. జై అమరావతి.. జై ఆంధ్రప్రదేశ్ అనే నివాదం వినిపిస్తే.. పోలీసులు అక్కడ వాలిపోతున్నారు.
చిన్నా చితక.. ముసలి.. ముతక అని చూడకుండా.. అరెస్టులు చేసి తీసుకెళ్లిపోతున్నారు. కానీ.. వైసీపీనేతలు మాత్రం ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా… ర్యాలీలు చేసేస్తున్నారు. వారికి 144 సెక్షన్లు వర్తించడం లేదు. అదే సమయంలో.. అమరావతి ఉద్యమకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఏపీలో .. చట్టం, న్యాయం.. ఏదైనా ఒక్క పార్టీకి.. ఆ పార్టీ నేతలకు మాత్రమే ఉంటాయని.. ఇతరులు ఏం చేసినా చట్ట విరుద్ధమేనని.. అభిప్రాయానికి రాక తప్పని పరిస్థితి.
ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసం కాకుండా… మొత్తం తమ కోసమే.. ఓ పార్టీ పని చేయించుకుంటూండటం .. సాదారణ ప్రజల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఇదేం పాలన అనుకునేలా చేస్తోంది. ప్రజలు .. ఇతరులు… ఇదేం చోద్యం అని అనుకుంటారోనన్న ఆలోచన కూడా.. అధికార పార్టీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమన్న అభిప్రాయం… సాధారణ జనాల్లో ఏర్పడుతోంది. ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటున్న వారంతా.. ఒక్క పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ.. ప్రజలపై … విరుచుకుపడుతున్న వ్యవహారం.. సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.