ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ ఆడియోటేప్ ఎలా లీకయింది..? ఉద్యోగులు ప్రెస్‌మీట్ ఎలా పెట్టగలిగారు..? ఆయనపై ఒకటికి వంద ఫిర్యాదులు ఎలా వెలుగు చూశాయి..? ఇవన్నీ ఇప్పుడు వైసీపీలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఫృధ్వీని పకడ్బందీగా ట్రాప్ చేసింది వైసీపీ నేతలేనని చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఫృధ్వీ కూడా నేరుగా అంగీకరించారు. తాను జగన్‌కు.. విజయసాయిరెడ్డి.. సుబ్బారెడ్డికి దగ్గరవుతున్నానని.. కొందరు కావాలనే తనపై కుట్రలు చేశారని.. ఆయన చెప్పుకొచ్చారు. అలా చేయాలి అంటే.. సొంత పార్టీ నేతలే చేయాలి. ఆ సొంత పార్టీ నెతలెవరనేదానిపై.. ఫృధ్వీనే ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
నిజానికి ఫృధ్వీకి.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మొదటి నుంచి పడేది కాదని.. తిరుమలలో గట్టి ప్రచారం ఉంది. ఎందుకంటే.. మొదటగా.. టీటీడీ బోర్డుతో పాటు… ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా సుబ్బారెడ్డికే జగన్ ఇచ్చారు. తర్వాత రెండు, మూడు రోజులకే తొలగించి.. ఫృధ్వీకి ఇచ్చారు. ఆ తర్వాత తన ఇష్టారాజ్యం అన్నట్లుగా ఫృధ్వీ వ్యవహరించారు. డబ్బులు తీసుకున్నారో లేదో కానీ… గతంలో ఉన్న 36మంది ఉద్యోగుల్ని తొలగించి.. తాను స్వయంగా 36మందికి అపాయిమెంట్ లెటర్లు ఇచ్చారు. వారంతా వైసీపీ సానుభూతిపరులే. ఒక్కొక్కరి దగ్గర రూ. 10 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో.. అందర్నీ సుబ్బారెడ్డి తొలగించారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు కూడా. అప్పట్నుంచే.. వైవీ సుబ్బారెడ్డిపై… ఫృధ్వీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. టీటీడీలో ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో.. ఫృధ్వీని టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఫధ్వీ.. సినిమా రంగం నుంచి వచ్చారు. అక్కడ చేసినట్లే.. ఎస్వీబీసీలోనూ చేస్తే తిరుగు ఉండదని అనుకున్నారు. కానీ.. ఆయన వైసీపీ రాజకీయాల్లో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయారు. చాలా సులువుగా.. వైసీపీ పెద్దల ట్రాప్‌కు చిక్కారు. పదవి ఊడగొట్టుకున్నారు. ఇప్పుడు.. ఫృధ్వీకి వైసీపీలో సానుభూతి లేదు.. ప్రజల్లో కూడా లేదు. ఇప్పుడు ఆయన ఒంటరి. ఆయన రాజకీయ భవిష్యత్ అలా ముగిసిపోయినట్లే. వైసీపీలో.. ఓ సామాజికవర్గం వారు మాత్రం.. గట్టిగా నిలబడగలరు… ఎవరైనా.. అతి చేస్తే.. ఫృధ్వీలాగే పరిస్థితి అవుతుందని.. ఆ పార్టీలోని కీలక నేతలు.. ఇప్పటికే కింది స్థాయి వరకూ హెచ్చరికలు పంపేసారు. మొత్తానికి ఫృధ్వీని వైసీపీ అలా వాడుకుందన్నమాట.