144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కశ్మీర్లో పరిస్థితులపై … కొద్ది రోజుల కిందట తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఎప్పుడు పడితే అప్పుడు 144 సెక్షన్ విధించడం కరెక్ట్ కాదని..అలా విధిస్తే.. న్యాయ సమీక్ష పరధిలోకి వస్తుందని తీర్పు వచ్చింది. కచ్చితంగా కశ్మీర్ లాంటి పరిస్థితులు అమరావతి గ్రామలాల్లో ఉన్నాయి. పోలీసుల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతున్నాయి. నిరసనలతో రోడ్డెక్కిన వారిపై… లాఠీలు విరుచుకుపడ్డాయి. మహిళలు అని కూడా చూడకుండా.. విరుచుకుపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ధైర్యం తెచ్చుకున్న రాజధాని గ్రామాల వాసులు.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేశారు.
ఈ లంచ్ మోషన్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. దృశ్యాల్లో పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టి తీసుకెళ్లారు. గ్రామాల్లో మహిళలు ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్నా .. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధిస్తున్నారని.. అదుకే పిటిషన్లు వేశారని.. పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. వచ్చే సోమవారానికి వాయిదా కోరారు. అయితే.. హైకోర్టు మాత్రం.. పరిస్థితి తీవ్రంగా ఉందని.. త్వరగా విచారణ జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో శుక్రవారంలోపు అఫిడవిట్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పోలీసులు ఈ అంశంపై.. అనుచితంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక్క కశ్మీర్‌కే అని.. తమకుకాపీ అందలేదని.. అమరావతి ఆందోళలను అణిచివేసేందుకు ప్రత్యేకంగా నియమితులైన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా ఎదుట తెలిపారు. నిజానికి కోర్టులు.. ప్రాంతాల వారీగా తీర్పులు ఇవ్వవు. చట్టం దేశం అంతా ఒక్కటే ఉంటుంది. డీఎస్పీగా ఈ విషయం తెలిసి కూడా.. శ్రీనివాసరెడ్డి.. రెటమతంగా సమాధానం చెప్పారు. దీంతో ప్రభుత్వం.. సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోదని తేలడంతో.. రైతులు, మహిళలు హైకోర్టులో పిటిషన్లు వేశారు.