జనసేన అధినేత పవన్ కల్యాణ్… జగన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూంటారు. ఇప్పుడు ఆ పేరును.. వంగవీటి రాధా కూడా అందుకున్నారు. పవన్ కల్యాణ్ తరహాలో జగన్ రెడ్డి అంటూ… ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ తర్వాత సైలెంటయిపోయిన విజయవాడ నేత వంగవీటి రాధాకృష్ణ.. రాజధాని రైతులకు మద్దతుగా బయటకు వచ్చారు. ఇటీవలి కాలంలో బహిరంగ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మూడు నెలల క్రితం.. పవన్ కల్యాణ్‌తో మాత్రం రెండు, మూడుసార్లు భేటీ అయ్యారు. అప్పుడు ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది… కానీ వంగవీటి మాత్రం.. అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. అలాగని. టీడీపీలోనూ చురుగ్గా లేరు. కానీ ఆయన రాజధాని రైతుల కోసం.. బయటకు వచ్చారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జిల్లాను, రైతులను జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేయడం రాజన్న రాజ్యమా?…పక్క రాష్ట్ర సీఎంతో గంటల తరబడి భేటీ అవుతున్న జగన్ రెడ్డికి రైతుల ఆందోళనలు కనిపివంచవా అని ప్రశఅనించారు. గత వారం.. చంద్రబాబు పాదయాత్రను బెంజ్ సర్కిల్ ప్రాంతంలో అరెస్ట్ చేసినప్పుడు… వంగవీటి రాధా.. చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో.. నడుచుకుంటూనే వెళ్లారు. ఇంటి దగ్గర పోలీసు నిర్బంధం ఉండటంతో.. రాధాను… చూసి.. లోకేష్ బయటకు వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు. దాంతో ఆయన.. టీడీపీ సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విషయం స్పష్టమయింది.
అయితే.. వంగవీటి రాధా… ప్రభుత్వంపై విమర్శలు చేసిన శైలి.. పవన్ కల్యాణ్‌ను.. తలపిస్తోంది. జగన్ రెడ్డి అంటూ.. పవన్ కల్యాణ్.. ఓ రకమైన చర్చను లెవనెత్తారు. దానికి ప్రతిఫలంగా పవన్ నాయుడు అంటూ.. వైసీపీ కాపు నేతలు పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేశారు. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు.. వంగవీటిపైనా.. వైసీపీ నేతలు.. అదే తరహా దాడులు చేస్తారో… లేదో చూడాలి..!