ఏడాదిలో వైఎస్ భారతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గానే ఉన్నారు. ఎలా అవుతుందో..ఎందుకు అవుతుందో చెప్పలేదు కానీ.. మొత్తానికి విషయం మాత్రం.. జగన్ కేసులే అని సులువుగా అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి పండగ రోజు.. పండుగ జరుపుకోకుండా… అమరావతి రైతులకు మద్దతు పలికేందుకు మందడం వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. అక్కడ ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందులోనే.. ఏడాదిలో జగన్ జైలుకెళ్తారని పరోక్షంగా.. భారతీ సీఎం అవుతారని చెప్పడం ద్వారా తేల్చారు.
జగన్ కేసుల విషయంలో ఇటీవలి కాలంలో వేగం పెరగడం… కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటూండటం.. బీజేపీని టార్గెట్ చేసేందుకు కేసీఆర్‌తో కలిసి వ్యూహాలు పన్నుతున్నట్లుగా ప్రచారం జరుగుతూండటంతో.. జగన్ బెయిల్ రద్దు గురించి తరచూ తరచూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకూ.. టీడీపీ నేతలు మాత్రం.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కొంత మంది రాజకీయ విశ్లేషకులు.. ఇప్పటికే జగన్.. ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్నారని.. ఆయన మరింతగా.. చెడ్డపేరు తెచ్చుకునేవరకూ చూసి… బీజేపీ మిగతా పని పూర్తి చేయాలనుకుంటుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో టచ్‌లో ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే ఉద్దేశంతో జేసీ దివాకర్ రెడ్డి మరో ఏడాదిలో .. భారతి సీఎం అవుతుందని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ జైలుకు వెళ్తే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి.. భారతికి కొన్నాళ్ల నుంచి అధికార వ్యవహారాలపై జగన్ అవగాహన పెచుతున్నారని అంటున్నారు. కొన్ని అధికార విధులు.. మరికొన్ని కీలకమైన మీటింగ్‌లకు.. భారతిని కూడా.. జగన్ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గవర్నర్‌తో జరిగే భేటీలకు కచ్చితంగా భారతి కూడా వెంట వెళ్తున్నారు. అయితే.. వైసీపీలోనే.. మరో ఇద్దరు సీనియర్ నేతలు.. బొత్స, పెద్దిరెడ్డి కూడా.. పోటీ పడే అవకాశం ఉందని.. వారు ఇప్పటికే.. కొంత మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నారని చెబుతున్నారు. వైసీపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సందర్భంలో.. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు మరింత కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.