నిద్రాణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి… కాస్త చలనం తెప్పించే ప్రయత్నాన్ని ఏఐసిసి చేసింది. పీసీసీ చీఫ్‌గా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను నియమించారు. ప్రస్తుతం… అనంతపురం జిల్లాకే చెందిన రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. కానీ ఆయన చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. సొంత ఊరిలో గుడి కట్టిస్తూ.. పొలం పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు.. ఏపీ పీసీసీకికొత్త చీఫ్ అవసరం అయింది. అంతో ఇంతో గుర్తింపు ఉన్న నేతలందరూ గత ఎన్నికల సమయానికే పార్టీ మారిపోయారు. సాకే శైలజానాథ్, తులసీరెడ్డి లాంటి వాళ్లు మాత్రం పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి … కాంగ్రెస్ లో చేరినప్పటికీ.. ఆయన పీసీసీ చీఫ్ పోస్ట్ తీసుకునేందుకు సిద్ధపడలేదు. మామూలుగా అయితే.. ఆయనకే ఆ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ కిరణ్ మాత్రం… ఆసక్తి చూపించలేదు. దాంతో హైకమాండ్ .. శైలజానాథ్ ను ఎంపిక చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. కడప జిల్లాకు చెందిన తులసీరెడ్డిని.. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా .. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీని ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కనిపించడం లేదు. ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నా.. తులసీరెడ్డి మాత్రం.. మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన వాయిస్ కాంగ్రెస్ పార్టీ విధానంగా కాకుండా… వ్యక్తిగతంగానే జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు.. శైలజానాథ్ ను కొత్త పీసీసీచీఫ్ గా ఎంపిక చేయడంతో… కొద్ది కొద్దిగా అయినా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసే అవవకాశం ఉంది.