భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. రెండు పార్టీల నేతలూ.. ప్రెస్‌మీట్లో.. వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ.. వైసీపీ మాత్రం.. పవన్ కల్యాణ్‌ను అదే పనిగా.. ఇంకా చెప్పాలంటే.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది కానీ.. బీజేపీ జోలికి మాత్రం పోవడం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పని చేయాలని.. ఎలాంటి ఎన్నికలు వచ్చినా కలసి పోటీ చేయాలని.. నిర్ణయించుకోవడంతో.. పరిస్థితి మారిపోయిందని అనుకున్నారు. ఇంత కాలం.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చిన.. వైసీపీ నేతలు ఇప్పుడు.. బీజేపీని కూడా విమర్శించాల్సి వస్తుందని రాజకీయవర్గాలు అంచనా వేఏశాయి. అయితే ఇందులోనూ.. వైసీపీ నేతలు.. ఓ లైన్ గీసుకున్నారు.
బీజేపీని చాలా అంటే.. చాలా పరిమితంగా.. టచ్ చేసి.. చేయనట్లుగా విమర్శలు చేసి.. పవన్ కల్యాణ్‌పై.. మాత్రం.. దారుణంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతలతోనే ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు. గురువారమే అంబటి రాంబాబు.. పవన్ పై.. విరుచుకుపడగా.. శుక్రవారం.. ఆ జోరు మరింతగా పెరిగింది. గుడివాడ అమర్నాథ్, బాలినేని, సుధాకర్ బాబు వంటి నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. కానీ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా..బీజేపీకి సుద్దులు చెబుతున్నారు. పవన్‌ని నమ్ముకోవడం అంటే.. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదడమే లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా.. స్పందించలేని నిస్సహాయ స్థితిని.. వైసీపీ మరోసారి బయట పెట్టుకుంటోంది. రాష్ట్ర అంశాలపై.. రాజకీయ విమర్శలు కూడా చేయలేని పరిస్థితిని వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం.. బీజేపీ పెద్దల్ని వైసీపీ నేతలు ఎలా నిలదీయగలరనేది.. చాలా మందికి వస్తున్న సందేహం.