`అల… వైకుంఠపురములో`తో ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది వరకే కేరళలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. సంక్రాంతి తరవాత మళ్లీ ఓ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాకోసం నాలుగు టైటిళ్లని రాసి పెట్టుకున్నాడు సుకుమార్. అందులో `శేషాచలం` ఒకటి. శేషాచలం అడవుల్లో జరిగే కథ ఇది. అందుకే ఆ టైటిల్‌ని పెట్టాలని భావిస్తున్నాడట. `రంగస్థలం` కూడా పాత టైటిలే. నాలుగక్షరాల సెంటిమెంట్, ఒకేరకమైన సౌండింగ్.. ఇవన్నీ ఈ టైటిల్ పెట్టేలా మొగ్గు చూపిస్తున్నాయట. అతి త్వరలోనే టైటిల్‌ని కూడా ప్రకటిస్తామని చిత్రబృందం చెబుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనున్నదని సమాచారం.