వంశీ అనగానే మీరు సీనియర్ దర్శకుడు వంశీ అననుకుంటారని తెలుసు.. ఎన్నో రోజులుగా ఆయన దర్శకత్వంలో రిలీజ్ కు రెడీ అయ్యి చడి చప్పుడు కాకుండా వచ్చింది ‘వెన్నెల్లో హాయ్ హాయ్’. ఆ సినిమా వచ్చింది అన్న విషయం కూడా ఎవరికి తెలియదంటే నమ్మరు. ఇకపోతే ఆ సినిమా చూశాకా సినిమా రిలీజ్ చేయకున్నా బాగుండేది అనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. అయితే వంశీ అనగానే మీరంతా ఇది ఊహించేసుకుంటారు కాబట్టి ఈ మ్యాటర్ డిస్కస్ చేశాం..
అయితే ఇక్కడ మనం మాట్లాడేది వక్కంతం వంశీ గురించి.. రచయితగా మంచి మంచి సినిమాలను అందించిన ఈయన మెగా ఫోన్ పట్టాలని ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్నాడు. అయితే తన కథలకు సూపర్ హిట్ ఇచ్చిన హీరో తారక్ తోనే తన మొదటి సినిమా అని ఇన్నాళ్లు ఎదురుచూసిన వక్కంతం వంశీకి ఎట్టకేలకు ఎన్టీఆర్ అవకాశం ఇస్తున్నాడని మొన్నామధ్య హడావిడి చేశారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం వంశీతో సినిమాకు రెడీ అయిన తారక్ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకుని పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ కు సిద్ధమైన తారక్ ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీతో సినిమా అనుకున్నా అతన్ని కాదని పూర్తితో ఫిక్స్ చేసుకున్నాడు.
పూరి సినిమా తర్వాత వక్కంతం వంశీ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన వంశీకి మళ్లీ నిరాశ కలగడం కాస్త ఆలోచనలో పడ్డాడని తెలుస్తుంది. అందుకే విక్టరీ వెంకటేష్ కు ఓ కథ వినిపించి మొదటి సినిమా వెంకటేష్ తో తీసేందుకు సిద్ధమయ్యాడట. మరి తారక్ వంశీని కావాలనే దూరం పెడుతున్నాడా లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.