సాయిబాబా అంటే షిరిడీ. షిరిడి అంటే సాయిబాబా. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం వివాదాస్ప నిర్ణయం తీసుకుందో.. ఆ నిర్ణయం వివాదాస్పదం చేశారో కానీ.. ఇప్పుడు.. హాట్ డిబేట్ గా మారింది. మరాఠ్వాడా ప్రాంతంలోని పర్బణీ జిల్లాలో పత్రి గ్రామం సాయిబాబా జన్మస్థలం అని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయించారు. ఇదీ షిరిడీ ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా తీసుకున్న నిర్ణయమేనని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. షిరిడీలో పూర్తి బంద్ పాటిస్తున్నారు. షిరిడీకి ప్రాధాన్యం తగ్గించకుండా పత్రికి కూడా సముచిత స్థానం ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కానీ పత్రికి ప్రాధాన్యం ఇస్తే షిరిడి ప్రాధాన్యం తగ్గిపోతుందనే వాదనలు వినిపిస్తున్నారు.
ఇలాంటి విషయాల్లో దూకుడుగా ఉండే బీజేపీ.. తన మార్క్ చూపిస్తోంది. శివసేన-ఎన్పీసీ-కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ వ్యవహారం ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. బీజేపీ ఎంపీలు.. ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. సాయిబాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడూ నిర్ధారించలేరని… ఇలాంటి రాజకీయ జోక్యం కొనసాగితే షిరిడీ వాసులు న్యాయ పోరాటం చేస్తారని బీజేపీ వారి తరపున మాట్లాడుతోంది. బీజేపీ వకాల్తా పుచ్చుకోవడంతో శివసేన నాయకత్వం మరింత పట్టుదలగా మారింది.
నిజానికి పత్రి అనే ఊరి గురించి చర్చ చాలా కాలంగా ఉంది. మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు ఉంది. ఇదే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు అంటారు. ప్రభుత్వం మాత్రంలో పత్రిలో వసతుల పెంపు కోసం కేటాయించిన నిధులను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం తగదని చెబుతోంది. సాయిబాబా మతం, ప్రాంతం లేని గురువు. ఆయన కేంద్రం ప్రాంత రాజకీయం నడవడమే.. కొత్త రాజకీయాల తీరు.