అల్లు అర్జున్ చేతికి ఓ సూపర్ హిట్టొచ్చింది. ఇక అల్లు శిరీష్‌నే కాస్త గాడిలో పడాలి. తనకో హిట్టు ఇవ్వాలని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ అంతా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఓ కథ సెట్ అయ్యింది. తమిళంలో విజయవంతమైన ‘ప్యార్ ప్రేమ కాదల్’ ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా అక్కడ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేశారు కూడా. కానీ.. అల్లు శిరీష్ రీమేక్ కోసం ప్రయత్నించడంతో డబ్బింగ్‌ని ఆపేశారు. ఇప్పుడీ సినిమాకి రాకేశ్ శశి చేతిలో పెట్టారు. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌తో `విజేత`తీసిన దర్శకుడీయన. విజేత ఫ్లాప్ అయ్యింది. అయినా సరే.. మెగా కుటుంబం ఈ దర్శకుడిపై నమ్మకం ఉంచడం విశేషం. గీతా ఆర్ట్స్‌లో చాలా కథలు తయారవుతున్నాయి. చాలామంది యువ దర్శకులు గీతా ఆర్ట్స్‌లో కథలు సిద్దం చేస్తున్నారు. వాళ్లలో ఎవరికి అవకాశం ఇచ్చినా.. శిరీష్‌తో ఓ హిట్టు సినిమా తీయగలరు. కానీ…. మళ్లీ రాకేశ్ శశిని నమ్మడం.. ఆలోచించాల్సిన విషయమే.