అల వైకుంఠపురములో విజయంలో మురళీ శర్మది కీలక పాత్ర. మధ్యతరగతి తండ్రి వాల్మీకిగా తన నటన అందరికీ నచ్చింది. ఆ క్యారెక్టరైజేషనే ఈ సినిమాకి మూలం కూడా. అలాంటి.. అల వైకుంఠపురములో సక్సెస్ మీట్లకు మురళీ శర్మ డుమ్మా కొట్టాడు. ఒకసారి కాదు.. రెండు సార్లూ మురళీ శర్మ కనిపించలేదు. దానికి కారణం… గీతా ఆర్ట్స్ వైఖరే అని తేలింది.
రోజువారీ పారితోషికం తీసుకోవడం మురళీ శర్మకి అలవాటు. కాకపోతే.. ఈసినిమా కోసం ఒకేసారి 50 రోజుల కాల్షీట్లు కావల్సివచ్చింది. 50 రోజులకూ ఇంత అని పారితోషికం ఫిక్సయ్యింది. కాకపోతే ఈ సినిమా కోసం ఆయన 70 రోజులు సెట్‌కి వెళ్లాల్సివచ్చిందట. మిగిలిన 20 రోజులకు గానూ పారితోషికం ఇవ్వమని మురళీ శర్మ డిమాండ్ చేయడం, దాన్ని గీతా ఆర్ట్స్ లైట్ తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది. అందుకే రెండు సక్సెస్ మీట్లలోనూ మురళీ శర్మ కనిపించలేదని టాక్. సినిమా బాగా ఆడింది. డబ్బులు భీకరంగా వస్తున్నాయి.. ఇలాంటి సమయంలో నటీనటుల పారితోషికం విషయంలో ఇలా కక్కుర్తి పడడం ఎందుకో మరి.??