బెదిరింపులు, బేరాలు, దాడి ప్రయత్నాలు, మంత్రులే పోడియం చుట్టుముట్టడాలు.. ఇవన్నీ.. శాసనమండలిలో చోటు చేసుకున్నాయి. కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం మాత్రం ప్రజలకు దక్కలేదు. సాయంత్రం వరకు.. కనీసం శాసనసభ లాబీల్లో ఉన్న టీవీల్లో అయినా ప్రసారం చేశారు. అక్కడ్నుంచి.. రీ ప్రోడక్షన్ జరుగుతోందని.. తెలిసి.. వాటినీ నిలిపివేశారు ప్రభుత్వ పెద్దలు. శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా.. వ్యవహారాలు చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. మండలి సభ్యులు కానీ పధ్నాలుగు మంది మంత్రులు.. శాసనమండలికి వచ్చారు. వారందరూ.. మండలి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చారు.
చైర్మన్ చుట్టూ గుమికూడి గద్దింపు స్వరంతో మాట్లాడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఎలాగైనా.. బిల్లును ఆమోదించుకున్నాం..అనిపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ లేని విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మండలి గ్యాలరీలో ఉదయం నుంచి ఉన్నారు. వివిధ సందర్భాల్లో వారు ఎమ్మెల్సీలతో మాట్లాడారు. బెదిరింపులకు కూడా దిగారన్న విమర్శలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. వీటన్నింటిపై.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు.. గవర్నర్కు..సభ జరుగుతున్నప్పుడే ఫిర్యాదు చేశారు.
ఎంత చేసినా.. టీడీపీ నుంచి ఇద్దరు సభ్యుల్ని మాత్రమే.. వ్యతిరేకంగా ఓటు వేయించగలిగారు. పరిటాల ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్న పోతుల రామారావు భార్య పోతుల సునీత, బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి .. సోదరుడి కుమారుడు శివనాథ్ రెడ్డి రూల్ నెంబర్ 71ను వ్యతిరేకించారు. వీరిద్దరూ తప్ప ఇంకెవర్నీ వైసీపీ ఆకర్షించలేకపోయింది. కానీ.. తెర వెనుక వ్యవహారాలతో… కుట్రలు చేస్తున్నామని.. ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతతో.. ప్రజలకు తనే సాక్ష్యం ఇచ్చినట్లయింది.