లాయర్ ఫీజు కోసం.. ఏపీ ప్రభుత్వం రూ. ఐదు కోట్లు విడుదల చేసింది. ఇది ప్రభుత్వం తరపున వివిధ కోర్టుల్లో వాదన కోసం నియమితులైన అడ్వకేట్ జనరల్ దగ్గర్నుంచి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వరకూ.. నెలకు ఇచ్చే జీతాల కన్నా.. చాలా..చాలా ఎక్కువ. ఆ లాయర్ పేరు ముకుల్ రోహత్గీ. ఆయన వాదించాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రాజధాని తరలింపు అంశాలపై సుప్రీంకోర్టులో పడిన పిటిషన్లు. ప్రభుత్వం తరపున ఎలాటి వాదనలు అయినా.. అడ్వకేట్ జనరల్ వాదించడం కామన్. ప్రైవేటు లాయర్లను.. అంత సామాన్యంగా.. ప్రభుత్వం నియమించుకోదు.
ముఖ్యంగా కోట్లకు కోట్లు ఫీజులు ఇచ్చి అసలు నియమించుకోదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏ మాత్రం తగ్గాలనుకోవడం లేదు. ప్రజల సొమ్మే కాబట్టి.. ఆయన అణుంత కూడా ఆలోచించలేదు. తక్షణం ముకుల్ రోహత్గీకి రూ. కోటి అడ్వాన్స్ చెల్లించాలని జీవో జారీ చేశారు. ఆ జీవోలోనే ఆయన ఫీజును రూ. ఐదు కోట్లుగా పేర్కొన్నారు. రాజధాని తరలింపు.. సీఆర్డీఏ రద్దుల పై.. హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. సీఆర్డీఏ బిల్లు రద్దు చేయడం వల్ల … రైతులకు.. లక్షన్నర కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల వరకూ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని.. న్యాయనిపుణులు అంచనా వేశారు.
అలాగే.. విభజన చట్టం ప్రకారం.. మూడు రాజధానుల ఏర్పాటు కూడా.. సాద్యం కాదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించి… హైకోర్టులో సరైన ఫలితం పొందేందుకు.. ప్రభుత్వం రూ. ఐదు కోట్ల లాయర్‌ను నియమించింది. రోహత్గీ అత్యంత సీనియర్ లాయర్. ఆయన మాజీ అటార్నీ జనరల్ గా పని చేశారు.