ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ దిగగానే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అలాగే.. బీజేపీ తరపున కన్నా, జీవీఎల్ , పురందేశ్వరి, సునీల్ ధియేటర్ కూడా.. హాజరయ్ారు. నిర్మలా సీతారామన్‌తో గంటపాటు రాజధాని అంశంపై నిర్మలాసీతారామన్‌తో చర్చించామని పవన్ ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదని … రాజధాని విషయంలో బీజేపీ- జనసేన కలిసి బలమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ శాశ్వత రాజధాని అమరావతేనని పవన్ కల్యాణ్ మరోసారి తేల్చి చెప్పారు.
విశాఖలో రిపబ్లిక్‌డే వేడుకలు అని ఇప్పుడు మార్చేశారని .. రాజధానిని మార్చడం అంత తేలిక కాదని సెటైర్ వేశారు. 3 రాజధానులకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదని .. కేంద్రాన్ని భ్రష్టుపట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని.. శాశ్వత ప్రణాళికలతో పాలన సాగించాలని హితవు పలికారు. కేంద్ర ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి.. లక్షల కోట్ల నిధులు తీసుకుని యూసీలు ఇవ్వలేదున్నారు. రాజధానిై జనసేన, బీజేపీ కార్యాచరణను తర్వాత ప్రకటిస్తామన్నారు.
నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో.. గత టీడీపీ ప్రభుత్వంలాగే..ఈ ప్రభుత్వం కూడా.. బీజేపీని బద్నాం చేసే ప్రణాళికలతో పాలన సాగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని తిప్పి కొట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మరికొంత మంది బీజేపీ ముఖ్యులను కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది.