శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను.. సెలక్ట్ కమిటీకి పంపుతూ.. మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండు,మూడు నెలలు.. రాజధానుల అంశం పెండింగ్‌లో పడిపోనుంది. ఈ అంశంపై.. రోజంతా.. శాసన మండలిలో ప్రతిష్టంభన ఏర్పడింది. బిల్లులపై ఓటింగ్ జరపాలని.. అధికారపక్షం.. సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనని ప్రతిపక్షం మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించాయి. ముందుగా.. ఈ రెండు బిల్లులపై కలిపి.. ఒకే సారి చర్చ నిర్వహించారు మండలి చైర్మన్. అందరూ ప్రసంగించిన తర్వాత.. అసలు విషయం తెరపైకి వచ్చింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే… టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు నోటీసులు ఇచ్చారు.
అయితే.. అవి సాంకేతికంగా మూవ్ కాలేదని.. చైర్మన్ చెప్పారు. దీంతో.. మంత్రులు.. ఒక్క సారిగా.. చైర్మన్ పై ఒత్తిడి తెచ్చారు. సెలక్ట్ కమిటీకి పంపే అధికారం చైర్మన్ కు లేదని వాదిస్తూ.. బిల్లులపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టారు. టీడీపీ మాత్రం… టెక్నికల్ గా జరిగిన తప్పు..చైర్మన్ సిబ్బంది వైపు నుంచి జరిగింది కాబట్టి.. తమను శిక్షించడం కరెక్ట్ కాదని వాదించారు. ఈ ప్రతిష్టంభన మధ్య.. వాయిదా పడిన శాసనమండలి.. మూడు గంటల పాటు సమావేశం కాలేదు. శాసనమండలిలో.. ఇరవై మందికిపైగా మంత్రులు గుమికూడారు. చైర్మన్ పై ఒత్తిడి తెచ్చారు. సమస్యను పరిష్కరించడానికి శాసనమండలి చైర్మన్.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. మరో వైపు న్యాయపరంగా పోరాడటానికి కూడా సిద్దమని చెప్పేందుకు ప్రభుత్వం.. అడ్వకేట్ జనరల్ ను కూడా.. అసెంబ్లీకి హుటాహుటిన పిలిపించారు.
ఎంత చేసినా.. శాసనమండలి చైర్మన్ మాత్రం.. ఆయా బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.దీతో..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది. బిల్లును… తిరస్కరించినా..ఏదో విధంగా.. మళ్లీ బిల్లును అమల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు కానీ.. ఇప్పుడు సెలక్ట్ కమిటీకి పంపడంతో… ఈ ప్రక్రియ.. రెండు, మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై పైచేయి సాధించినట్లయింది.