రాజధాని రైతులు వేసిన పిటిషన్లను.. వాదించడానికి ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఆయనకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చింది. మరో రూ. నాలుగు కోట్లు విడుదల చేయనుంది. ఆయన ఫీజు నిమిషాల లెక్కన ఉంటుంది. ఎంత సమయం కేసు కోసం కేటాయిస్తే.. అంత ఫీజు వసూలు చేస్తారు. అది ఎంత అనేది..అంచనా వేయడం కష్టం. దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లలో ఆయన మొదటి వారు. ఈ ముకుల్ రోహత్గీని ప్రభుత్వం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధం. అయితే.. అది వ్యక్తిగతం కాదు. వృత్తిగతమే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన చాలా సార్లు తన వాదనలను.. ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టు ముందు వాదించారు.
జగన్ .. తన అక్రమాస్తుల కేసులో వాదనల కోసం.. ముకుల్ రోహత్గీని కౌన్సుల్గా నియమించుకున్నారు. కేసులు నమోదయినప్పుడు.. బెయిల్ పిటిషన్లు వేసినప్పుడు.. ఇతర పిటిషన్లు వేసినప్పుడు.. చాలా సార్లు ఆయన సేవలు వినియోగిచుకున్నారు. ఆయన … చాలా రోజుల పాటు.. జగన్ కేసు ల కోసం సమయం కేటాయించారు. అయితే.. ఆయన లాయర్ ఫీజులు ఎంత చెల్లించారన్నదానిపై చర్చ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే.. ఢిల్లీ లాయర్లు అత్యంత ఖరీదైన వారని తెలుసు కానీ.. ఎంత ఖరీదు అని తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే.. ఓ లెక్క విడుదల చేసింది. ఓ కేసు విచారణ కోసమే వాదనలు వినిపించాలంటే.. రూ. ఐదు కోట్లు దగ్గర పెట్టుకోవాలని అంచనా వేసింది. కేసు వాయిదాలు.. విచారణను బట్టి ఈ బిల్లు పెరుగుతూ ఉంటుంది.
ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల్లో వాదనలు వినిపించడానికి కనీసం రూ. వంద కోట్ల రూపాయలు రోహత్గీకి చెల్లించి ఉంటారనే వాదన.. న్యాయవాద వర్గాలు వినిపిస్తున్నాయి. ఒక్క రోహత్గీ బిల్లే.. వందల కోట్లకు చేరి ఉంటుందని.. ఇతర లాయర్లు.. కౌన్సుళ్లు.. ఖర్చుల వ్యవహారం.. ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి… అక్రమాస్తుల కేసుల్లోని విలువ… తక్కువేం కాదు.. అలాగే.. ఆ కేసుల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నం కూడా… ఖరీదైనదేనని.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు.