అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు .. పెద్ద మొత్తంలోభూములు కొనుగోలు చేశారని.. సీఐడీ కేసులు నమోదు చేశింది. మొత్తం 796 తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేశారు. ఎకరం రూ. రూ.3కోట్ల చొప్పున 300 కోట్ల విలువైన భూములు.. కొనుగోళ్లు చేసినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. తెల్ల రేషన్ కార్డు దారులకు అంత ఆదాయం లేదని.. వారు బినామీలని.. సీఐడి అనుమానిస్తోంది. అసలు కొనుగోలుదారులు ఎవరనేదానిపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. పెదకాకానిలో 43 మంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు 40 ఎకరాలు, తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు కొన్నట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు.
ఈ కొనుగోళ్లలో హస్తం ఉందంటూ.. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, మార్కెట్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావుపై కేసులు నమోదు చేశారు. మభ్యపెట్టి తన భూమి కొన్నారని.. వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేసినట్లుగా..సీఐడీ అధికారులుచెబుతున్నారు. తెల్లరేషన్ కార్డు దారులతో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తున్నామని.. విచారణ వేగవంతం చేస్తామని.. సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రకటించారు. ఏపీలో.. పధ్నాలుగు లక్షల కుటుంబాలు ఉంటే.. పదిహేను లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం.. ప్రతీ కుటుంబం.. వైట్ కార్డు తీసుకుంది. ఇప్పుడు ఇలా.. వైట్ కార్డు ఉన్న వారు భూములు కొనడమే తప్పన్నట్లుగా కేసు పెట్టారు.
ఏ కోణంలో.. ప్రత్తిపాటి, నారాయణపై కేసులు పెట్టారో సీఐడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రత్తిపాటి మాత్రం.. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారుని .. అక్రమ కేసులు పెట్టే అధికారులను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. అమరావతి భూములపై ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ.. చివరికి.. మభ్య పెట్టి కొనుగోలు చేశారని… వైట్ రేషన్ కార్డులు ఉన్నా కొనుగోలు చేశారని..కేసులు పెట్టారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే… !